నాగశౌర్య, సోనారిక(తొలిపరిచయం), అజయ్, కోటశ్రీనివాసరావు, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వీ తదితరులు, సత్య ఎంటర్ టైన్సెంట్స్ బ్యానర్, నిర్మాత: వి.వి.ఎన్.ప్రసాద్, దర్శకుడు: యోగేష్
క్లాస్ మూవీస్ చేస్తున్న నాగశౌర్య మాస్ ఇమేజ్ కోసం చేస్తున్న ప్రయత్నమే ‘జాదూగాడు’. చింతకాయల రవి చిత్రాన్ని తెరకెక్కించిన యోగేష్ దర్శకుడు. సత్య ఎంటర్ టైన్సెంట్స్ బ్యానర్ పై వి.వి.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి నాగశౌర్యకి మాస్ లుక్ ఎలా ఉంటుందో, సూటవుతుందో లేదోనని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. మరి నాగశౌర్య ప్రేక్షకులను ఏ మేర మెప్పించాడో తెలుసుకోవాలంటే ట్రైటర్ రివ్యూ చూడాల్సిందే...
ఇక్కడ గెలుపే ముఖ్యం. గెలవాలంటే దేనికైనా ప్రేపేర్ అవ్వాలి. అయితే సాధించాలి లేకపోతే చావాలి అనే నాగశౌర్య డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
ట్రైలర్ లో నాగశౌర్య లుక్ చాలా బావుంది. తను ఇప్పటి వరకు చేసిన సినిమాల తరహాలో కాకుండా కొద్దిగా రగ్ డ్ లుక్ లో కనపడే ప్రయత్నం చేశాడు.
ఈ సిటీలో ప్రేమగా పలకరిస్తారు..పర్సులు కాజేస్తారు అనే శ్రీనివాసరెడ్డి డైలాగ్..ఒరేయ్ చంపడం నీకొక వింత నాకు వెంట్రుకంతా అని సప్తగిరి చెప్పే డైలాగ్ కామెడిని పుట్టిస్తుంది.
నువ్వు లక్కీనే పిల్లా కలిసిని మూడు సార్లకే మూడు ముద్దులు కొట్టేశావ్ ..అంటూ హీరో హీరోయిన్ తో చెప్పే డైలాగ్...
చిన్నోడితో పెట్టుకో పెద్దోడితో పెట్టుకో నాలాంటి చిచోరాగాడితో పెట్టుకోకు... హీరో డైలాగ్..
ఇక్కడ ఎవడి చేతిలో గన్ ఉంటే వాడే బాస్ రా ..అని అజయ్ చెప్పే డైలాగ్
ట్రైలర్ లో హీరోతో ఎక్కువ డైలాగ్స్ చెప్సించారు.
గోల చేద్దామే ఓ పిల్లా ..అనే సాంగ్...
మాస్ గాడే వీడు... అనే సాంగ్
అనే రెండు ఫాస్ట్ బీట్ సాంగ్స్
వీటి కలయితో ట్రైలర్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. హింస కూడా ఎక్కువగా ఉండచ్చునేమోనని భావన ప్రేక్షకుడికి కలిగే అవకాశం. మరి సినిమాలో నాగశౌర్య క్యారెక్టర్ ఎలా ఎలివేట్ అవుతుందో చూడాలి...
Post Your Comment