కేరింత

May 26, 2015 | 12:00 PM |5 Views
Movie Name :
కేరింత
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=HuNMitdSFVY
Actor/Actress/Director names :

సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, అవంతిక, తేజస్వీ తదితరులు, నిర్మాత: దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, సంగీతం: మిక్కీ జే మేయర్, దర్శకత్వం: సాయి కిరణ్ అడవి

Expected Release Date :
2015-06-19
Synopsis :

దిల్ రాజు నిర్మాతగా సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్విని సహా నూతన నటీనటులతో చేసిన సినిమా ‘కేరింత’. సాధారణంగా చిన్న సినిమాలను చేసి పెద్ద సక్సెస్ లను కొట్టే దిల్ రాజు మధ్యలో చిన్న సినిమాలను నిర్మించడం మానుకున్నాడనే చెప్పాలి. అయితే గ్యాప్ తీసుకుని దిల్ రాజు చేసిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీయే కేరింత. సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిక్కి మ్యూజిక్ అందించిన ఆడియో విడుదలైంది. మరి టీజర్ రివ్యూ చూద్దాం. టీజర్ లోకి వెళితే..శ్రీకాకుళం నుండి వచ్చిన నూకరాజు అనే క్యారెక్టర్ తో టీజర్ స్టార్టవుతుంది. సిద్, భావన, జై, దియాతో సహా తనను తాను పరిచయం చేసుకోవడంతో టీజర్ మొదలవుతుంది. ఒక్కొక్కరు వారి ప్రేమను ఎలా గెలుచుకున్నారు? అనే విషయమే కాకుండా ఫ్రెండ్ షిప్ లో చిన్న గొడవలున్నాయంటూ కూడా ఎమోషనల్ పార్ట్ ను చూపించారు. ఎలా కలిశామో గుర్తుకు వస్తే హ్యాపీగా అనిపించాలి కానీ ఎందుకు కలిశామని అనిపిస్తుంది రా అనే డైలాగ్స్ తో అబ్బూరి రవి పెన్ స్టయిల్ తెలుస్తుంది. ఫైవ్ మినిట్స్ ఫేస్ బుక్ లో ఛాట్..గుంట ప్లాట్ అని చివర్లో కూడా నూకరాజు డైలాగ్ తోనే టీజర్ ఎండ్ అవుతుంది. ఈ టీజర్ మొత్తం మీద నూకరాజు క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. టీజర్ చాలా కేర్ ఫుల్ గా కనపడుతుంది. మిక్కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా క్లాస్ గా ఉంది.

Post Your Comment

తాజా వార్తలు