మోసగాళ్లకు మోసగాడు

April 27, 2015 | 11:27 AM |4 Views
Movie Name :
మోసగాళ్లకు మోసగాడు
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=4EhSJJn6v7A
Actor/Actress/Director names :

సుధీర్ బాబు, నందిని, చంద్రమోహన్, అభిమన్యుసింగ్, ప్రవీణ్ తదితరులు...

ఎడిటర్-కార్తీక శ్రీనివాస్, కెమెరా- ఉమ్మాడిసింగు సాయిప్రకాష్, సంగీతం-మణికాంత్ కద్రి, బ్యానర్- లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత- చక్రి చిగురుప

Expected Release Date :
2015-05-15
Synopsis :

స్వామిరారా వంటి క్రైమ్ కామెడి చిత్రంతో బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్ రూపొందించిన సీక్వెల్ చిత్రమే మోసగాళ్లకు మోసగాడు. సుధీర్ బాబు హీరోగా నటించాడు. టైటిల్ కూడా సూపర్ హిట్ టైటిల్ ను ఎంచుకోవడంతో సినిమా ఎలా ఉంటుందనే అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఏప్రిల్ 26న ఆడియో వేడుకలో భాగంగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ లో సినిమా ఎలా ఉంటుందనే దాని గురించి ఒక అంచనా ఏర్పడే అవకాశ ఉంది కాబట్టి అందులో భాగంగా ట్రైలర్ రివ్యూ...

స్వామిరారా చిత్రం ఒక విగ్రహం చుట్టూ తిరుగుతుంది. అలాగే మోసగాళ్లకు మోసగాడు చిత్రం కూడా 12వ శతాబ్దంలో విక్రమాదిత్య మహారాజు చేయించిన శ్రీరాముని విగ్రహం చుట్టూ తిరుగుతుందని తెలిసిపోయింది. ఆ విగ్రహాన్ని విలన్ గ్యాంగ్ అయిన రుద్ర, జయప్రకాష్ రెడ్డి గ్యాంగ్ చోరి చేస్తుందని దాని చుట్టూనే సినిమా కథ నడుస్తుందనే కాన్సెప్ట్ రివీల్ అయింది. అయితే ఈ చిత్రంలో సుధీర్ చాలా గుడ్ లుకింగ్ తో కనపడుతున్నాడు. పోలీస్, పొలిటీషియన్ గెటప్స్ కనపడుతున్నాడు. చిన్న చిన్న మోసాలు చేసుకుని బతికేస్తుంటానని హీరో అనడంతో హీరో దొంగ, మోసగాడు అనే క్యారెక్టర్ చేస్తున్నాడని అర్థమవుతంది. ట్రైలర్ ఓహో సుందరి మాట వినవే ఓ సుందరి...అనే సాంగ్ లో హీరోయిన్ కనపడుతుంది. హీరోయిన్ ఓకే. మణికాంత్ కద్రి ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ఉమ్మాడి సింగు సాయిప్రకాష్ సినమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి సీన్ రిచ్ గా కనపడుతుంది. మరి పూర్తి సినిమా కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది కానీ సినిమా రన్నింగ్, మేకింగ్ తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Post Your Comment

తాజా వార్తలు