నటీనటులు- రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, సంపత్ రాజ్, సాయికుమార్ తదితరులు, సినిమాటోగ్రఫీ- సమీర్ రెడ్డి, సంగీతం- ఎస్.ఎస్.థమన్, బ్యానర్- యునైటెడ్ మూవీస్, నిర్మాత- పరుచూరి కిరిటీ, దర్శకత్వం- గోపించద్ మలినేని
పద్దెనిమిది నెలలు గ్యాప్ తీసుకుని హీరో రామ్ ప్రేక్షకుల ముందకు తీసుకొస్తున్న చిత్రం పండచేస్కో. హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ ఈ చిత్రంపై చాలా ఆశలనే పెట్టుకున్నాడని చెప్పాలి. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుని గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేశాడని, రెడీ, కందరీగ చిత్రాల తర్వాత ఈ సినిమా రామ్ కెరీర్ లో మరో పెద్ద హిట్టవుతుంది చిత్రయూనిట్ ధీమాను వ్యక్తం చేస్తుంది. సినిమాపై మంచి అంచాలే ఉన్నాయనడంలో సందేహం లేదు. అందులో భాగంగా ఆడియో, థియేట్రికల్ ట్రైలర్స్ విడుదలయ్యాయి. ఇక థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ విషయానికొస్తే...
ట్రైలర్ రామ్ స్టైలిష్ లుక్ ఎంట్రీతోనే స్టార్టవుతుంది. పండగచేస్కో టైటిల్ సాంగ్ , ఓ మై బేబి..అనే సాంగ్స్ ట్రైలర్ అంతా వినపడుతున్నాయి. సంపత్ రాజ్, సాయికుమార్ రోల్స్ ఆసక్తిని గొలిపే విధంగా ఉన్నాయి. వీడు ఇంత కసిగా కొడుతున్నాడంటే కచ్చితంగా దివ్యను ప్రేమించినవాడే అయ్యుంటాడని సంపత్ రాజ్ చెప్పడంతో హీరోయిన్ రకుల్ పేరు దివ్య అని తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ క్యూట్ గాక కనపడుతుంటే సోనాల్ చౌహాన్ చాలా గ్లామర్ గా కనపడుతుంది. ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటుంది, ప్యామిలీ లో ఉంటుంది, గుండెల్లో నుండి వచ్చే దమ్ములో ఉంటుందని సొల్లు చెప్పడం ఇష్టం ఉండదురా... అని చెప్పే డైలాగ్ తో హీరో ఈజ్ తో సాగే క్యారెక్టర్ అని అర్థమవుతుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనపడుతుంది. గోపిచంద్ భారీతారాగణంతో ప్రతి సీన్ ను తెరకెక్కించాడు. బ్రహ్మానందం యాజ్ యూజువల్ గా కోనవెంకట్ కామెడి పండించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద థియేట్రికల్ ట్రైలర్ కలర్ ఫుల్ గా, క్లాస్ గా కనపడుతుంది.
Post Your Comment