శంకరాభరణం

November 05, 2015 | 10:15 AM |6 Views
Movie Name :
శంకరాభరణం
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/user/KonaVenkatOfficial
Actor/Actress/Director names :

నిఖిల్, నందిత రాజ్, అంజలి, సప్తగిరి, రావు రమేష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, సంజయ్ మిశ్రా తదితరులు

కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, దర్శకత్వం: ఉదయ్ నందనవనం.

Expected Release Date :
2015-11-20
Synopsis :

యంగ్ హీరో నిఖిల్ స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’.. లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత  నటించిన మరో సరికొత్త కథాంశంతో నడిచే సినిమా శంకరాభరణం. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, మాటలు అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తూ చేసిన సినిమా కావడంతో శంకరాభరణం సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ కనిపించింది. బాలీవుడ్ సినిమా పస్‌గయారే ఒబామా మూలకథతో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను అక్టోబర్ 30న పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

ఇప్పటికే టీజర్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందనే విషయాన్ని రుచి చూపించిన ‘శంకరాభరణం’ టీమ్, ట్రైలర్‌తో మరింతగా ఆకట్టుకుంటోంది. ‘బీహార్‌లో ఐదే ఐదు విషయాలు ఫేమస్’ అంటూ ఆసక్తికరంగా మొదలయ్యే ఈ ట్రైలర్ సినిమాలో ఏమేం ఉండనున్నాయనే విషయాన్ని స్పష్టంగా చూపించాయి. నిఖిల్ ఈ సినిమాలో ఓ ఎన్నారైగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఒక ఎన్నారై బీహార్ ప్రాంతంలో చిక్కుకుపోవడమనే అంశం చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందనే విషయాన్ని ట్రైలర్ తెలియజేస్తుంది. నిఖిల్ సరసన క్యూట్ గర్ల్ నందిత హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ అంజలి బందిపోటు దొంగగా కీలక పాత్రలో నటించనుంది.

ఇక ఈ ట్రైలర్‌లో హై క్లాస్ విజువల్స్, డైలాగ్స్, కామెడీ తదితర అంశాలు మేజర్ హైలైట్‌గా కనిపిస్తున్నాయి. అంజలి స్పెషల్ రోల్ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందన్న విషయం ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్‌తో సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి.

Post Your Comment

తాజా వార్తలు