సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

August 24, 2015 | 12:41 PM |16 Views
Movie Name :
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?t=34&v=122MticgxDs
Actor/Actress/Director names :

సాయి ధరమ్ తేజ్, రెజీనా, అదాశర్మ, నాగబాబు, సుమన్, బ్రహ్మానందం, రావురమేష్ తదితరులు  

సినిమాటోగ్రఫి : సి. రామ్ ప్రసాద్ . ఎడిటింగ్ : గౌతం రాజు . ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, వెంకట్ . స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్ , సంగీతం: మిక్కీ జే మేయర్ కో ప్రొడ్యూసర్స్ - శిరీష్, లక్ష్మణ్.  నిర్మాత - దిల్ రాజు. కథ - మాటలు - దర్శకత్వం : హరీష్ శంకర్. ఎస్.

Expected Release Date :
2015-09-18
Synopsis :

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.   రెజీనా , అదాశర్మ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.  ఈ చిత్ర ఆడియో పంక్షన్ ఇటీవలె జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పై నెగెటివ్ టాక్ రావడంతో…. అసలైన ఎంటర్టైన్ ను పంచుతూ పూర్తి స్థాయి ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.  ఇక ట్రైలర్ లో  సాయి ధరమ్ తేజ్ పంచ్  డైలాగ్ లతో అదరగొట్టాడు.

‘అమెరికా వచ్చింది ప్రతి సెకండూ డాలర్లు సంపాదించి , ఇండియా వెళ్లి కాలర్ ఎగిరేయడానికి... కొంత మంది లెక్కలు రాసుకుంటారు, నేను మాత్రం లెక్కలు తేల్చుకుంటాను. నేను మాటలతో మాయ చేయగలను, సంచుల కొద్ది పంచులేయగలను, కానీ నా టార్గెల్ పంచేయడం కాదు, పని చేయడం’ అంటూ కాన్సెప్ట్ ను మూడు డైలాగుల్లో కానిచ్చేశాడు. హీరోయిన్ రెజీనా సీత క్యారెక్టర్ లో నటించినట్లు అర్థమౌతుంది. సాఫ్ట్ కార్న్ ఉన్న పాత్రలో ఆమె నటంచినట్లు తెలుస్తుంది. పిల్లా నువ్వు లేని జీవితంతో హిట్ కొట్టిన ఈ జంట మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైపోతుంది. ట్రైలర్ ఇద్దరి మధ్య రొమాన్స్ పాలు కూడా ఎక్కువగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఓ వైపు యాక్షన్ ఎపిసోడ్స్ తోపాటు మరోవైపు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రెడీ తెరకెక్కినట్లు అర్థమౌతోంది. మిక్కీజేమేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు, సుమన్, బ్రహ్మానందంలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.  సెప్టెంబర్ రెండో వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ ప్రయత్నాలు ప్రారంభించింది.

Post Your Comment

తాజా వార్తలు