మంచు మనోజ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, సురభి తదితరులు, దర్శకుడు రామ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న మరో మూవీ ఎటాక్. సి.కళ్యాణ్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. వర్మ ఈ సినిమాని ఫ్యాక్షనా లేక రౌడీయిజం కాన్సెప్ట్ తో తెరకెక్కించాడా అని ఇప్పుడు చెప్పలేం కానీ ట్రైలర్ చూస్తుంటే వర్మ గత చిత్రాలైన గాయం, రక్తచరిత్ర స్టయిల్ లో కనపడుతుంది. మరి ట్రైలర్ ఎలా ఉందో ఓ సారి సమీక్షిస్తే...
చెడ్డవాడిని మంచితనంతో వదిలేయడం మహాపాపం – మహాభారతం ఈ లైన్ తో వర్మ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్టవుతుంది. ధర్మరాజు జూదంలో ఓడాడు కాబట్టి జూదం చెడు కాదు..దుర్యోదనుడు గెలిచాడు కాబట్టి చెడు..
పాండవులు గెలిచారు కాబట్టి యుద్ధం మంచి కాదు..కౌరవులు ఓడారు కాబట్టి మంచిది...
మంచి, చెడు అనేది నిజాలు కావు..నమ్మకాలు. ఆ నమ్మకాలు కాపాడుకోవడానికే మనుషులు ఒకళ్ల మీద ఒకరు ఎటాక్ చేసుకుంటూ ఉంటారు.
ఒక మంచి మనిషి ఎవరి మీదైనా ఎటాక్ చేసేది చట్టం మంచి వాళ్లపై జరిగే ఎటాక్ లను ఆపలేకపోయినప్పుడే..
అలా చెడ్డ మూలాన నేలజారిన మంచిని, మంచితో కలిసిన చెడ్డతనంలో ఎటాక్ చేసి తిరిగి నిలబడేలా చేసిన వ్యక్తి కథే ఎటాక్..
ఇది ట్రైలర్ సింపుల్ సినిమా గురించి వర్మ చెప్పిన సారాంశం. మరి ఇందులో మంచి వ్యక్తులెవరో, చెడువ్యక్తులెవరో, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, మనోజ్, వడ్డే నవీన్ ల రోల్స ఏంటో క్లియర్ గా చూపించలేదు. అయితే ప్రకాష్ రాజ్, జగపతి బాబు, మనోజ్ లు ఓ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులుగా చూపించారు.
ట్రైలర్ లో హింసపాళ్లు ఎక్కువగా కనపడుతుంది. రక్తపు చుక్కలే అక్షింతలై జరుగుతున్న పెళ్లి..అనే బ్యాగ్రౌండ్ సాంగ్ కూడా ఇందులో మనకు వినపడుతుంది. అలాగే చివర్లో మనోజ్ నమ్మకం వచ్చేదే వ్యక్తుల నుండి..అని చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తం మీద వర్మ మరోసారి గాయం తరహా సినిమాని తనదైన స్టయిల్ లో తెరకెక్కించాడని తెలుస్తుంది.
Post Your Comment