జ్యోతిలక్ష్మి

May 18, 2015 | 11:00 AM |15 Views
Movie Name :
జ్యోతిలక్ష్మి
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=vehg67lcRzI
Actor/Actress/Director names :

ఛార్మీ, బ్రహ్మానందం, సంపూ. తదితరులు

 

కథ, స్రీన్ ప్లే, దర్శకత్వం పూరిజగన్నాథ్

Expected Release Date :
2015-06-13
Synopsis :

తన సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న మరో సినిమా ‘జ్యోతిలక్ష్మీ’. ఛార్మి టైటిల్ రోల్ పోషిస్తుంది. ఛార్మి సమర్పణలో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకాలపై ఈ సినిమా సంయుక్తంగా రూపొందుతోంది. శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు నిర్మాతలు. పూరి ఉమెన్ ఓరియెంటెడ్ మూవీగా జ్యోతిలక్ష్మీ సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేయగానే హీరోయిజాన్ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే పూరి హీరోయినిజాన్ని ఎలా ఎలివేట్ చేస్తాడోనని అందరూ అనుకుంటుండగా యాజ్ యూజువల్ గా పూరి తన స్టయిల్ లో మూవీని త్వరగా కంప్లీట్ చేసి  ట్రైలర్ రిలీజ్ చేశాడు. మల్లాది నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఓ వేశ్య కథ అనిపిస్తుంది. ఇందులో హీరో, జ్యోతిలక్ష్మీ అనే క్యారెక్టర్ ను ఇష్టపడటం, విలన్స్ వెంబడించడం వంటివి ట్రైలర్ లో కనపడుతున్నాయి. బ్రహ్మానందం, సంపూ క్యారెక్టర్స్ కామెడి పండించాలని ప్రయత్నంలో భాగంగా ఉన్నట్టు తెలుస్తుంది. చివర్లో ఛార్మి చాలా ఎమోషనల్ గా కనపడుతుంది. రివేంజ్ తీర్చుకునే స్టయిల్ లో తన క్యారెక్టర్ ను డిజైన్ చేశారనిపిస్తుంది. ట్రైలర్ చివర్లో ఛార్మి బుల్లెట్ డ్రైవ్ చేసే సీన్ బావుంది. అలాగే మీరు అడదాన్ని అర్థం చేసుకోనవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే అని పూరి స్టయిల్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి.

Post Your Comment

తాజా వార్తలు