శ్రీమంతుడు

June 01, 2015 | 10:38 AM |12 Views
Movie Name :
శ్రీమంతుడు
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=2ve6PEagFJc
Actor/Actress/Director names :

మహేష్ బాబు, శృతిహాసన్, జగపతి బాబు, సుకన్య, రాజ్యలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సంపత్ రాజ్, పూర్ణ, తదితరులు

 సినిమాటోగ్రఫీ ఆర్.మదీ, ఎడిటర్ కోటగిరీ వెంకటేశ్వర రావు, సంగీతం దేవీశ్రీప్రసాద్,  బ్యానర్ మైత్రి మూవీస్, నిర్మాతలు వై.నవీన్, వై.రవిశంకర్, సీవీ మోహన్, దర్శకుడు కొరటాల శివ

Expected Release Date :
2015-07-17
Synopsis :

నా పేరు హర్ష..నా దగ్గర లేనిది లేందంటుంటారు. కానీ నాక్కావాల్సింది ఇంకేదో ఉంది. దాని కోసం ఎంత దూరమైనా వెళ్లాలనిపిస్తుంది...

ఊరిని దత్తత తీసుకోవడమంటే జేబులు తీసి రంగులు, రోడ్లు వేసి వెళ్లిపోతాననుకున్నార్రా...వీడ్ని, వాడ్ని, వీళ్లందర్నీ, నిన్ను కూడా దత్తత తీసుకున్నాను. ..

ఇది మహేష్ బాబు తన టీజర్ లో పలికిన డైలాగ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్  కొరటాల శివ దర్శకత్వంలో  రూపొందుతోన్నసినిమా ‘శ్రీమంతుడు’. ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ లు నిర్మాతలు.  

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమా టీజర్ విడుదలైంది. టైటిల్ సరిపోయే విధంగా మహేష్ ఇందులో శ్రీమంతుడుగా కనిపిస్తున్నాడు. పెద్ద బిజినెస్ మేన్ అయిన మహేష్ ఏం కావాలనుకుంటున్నాడు. ఎందుకు అనే విషయాలను దర్శకుడు శివ మనకు ప్రశ్నగానే వదిలేశాడు. అదెంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మది సినిమాటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ సంగీతం చాలా బాగా ఉన్నాయి. మహేష్ లుక్స్ ఎక్స్ ట్రార్డినరీ. స్టయిలిష్ గా కనపడుతూనే, యాక్షన్ సన్నివేశాల్లో టోన్డ్ బాడీతో ఆదరగొడుతున్నాడు. ఈ టీజర్ కి ఆడియెన్స్  నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది.

Post Your Comment

తాజా వార్తలు