మలుపు

June 16, 2015 | 11:18 AM |38 Views
Movie Name :
మలుపు
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=9XLQoR3l1jM
Actor/Actress/Director names :

నటీనటులు: ఆదిపినిశెట్టి, నిక్కిగ్రాలని, మిథున్ చక్రవర్తి, ప్రగతి తదితరులు, సినిమాటోగ్రఫీ- షణ్ముగ సుందరం, ఆర్ట్ -  అమరన్,సంగీతం – ప్రసన్, ప్రవీణ్, శ్యామ్,  బ్యానర్ – ఆదర్శ చిత్రాలయ, నిర్మాత – రవిరాజా పినిశెట్టి, రచన- దర్శకత్వం – సత్యప్రభాస్ పినిశెట్టి

Expected Release Date :
2015-06-26
Synopsis :

ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి తొలిసారి నిర్మాతగా చేసిన చిత్రం మలుపు. ఆయన ఇద్దరు తనయుల్లో పెద్ద వాడైన సత్యప్రభాస్ తొలిసారిగా ఈ చిత్రంతో మెగాఫోన్ చేపట్టాడు. తమ్ముడు ఆది పినిశెట్టి హీరోగా డైరెక్షన్ చేశాడు. స్నేహితులతో సరాదాగా గడిపే ఓ వైజాగ్ కుర్రాడికి, ముంబై అండర్ వరల్డ్ డాన్ మొదలియార్ కి ఉన్న వైరం గురించే నడిచే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది

స్నేహమంటే నమ్మకం..ఆ నమ్మకం వమ్మైనప్పుడు..

ఈ లోకం అన్నికంటే గొప్ప రిలేషన్ షిప్ స్నేహమే...

నా పేరు సగా..వైజాగ్ లో ఫైనల్ బి.కాం చదువుతున్నాను...నా మిడిల్ క్లాస్ లైఫ్ లో నాకు అందని ఎన్నో ఆనందాలను నా ఫ్రెండ్స్ నాకు అందించారు..ఆరోజు నా అమ్మ నాన్నల కంటే నాకు నా ఫ్రెండ్సే ఎక్కువనిపించారు..

వాళ్లతో కలిసి నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నానని నాన్న ఎప్పుడూ అంటుండేవారు..అయినా మాట నేనెప్పుడూ వినలేదు..వినుంటే బాగుండేదని ఇప్పుడనిపిస్తుంది. వినుంటే ఇలా భాష రాని ఊర్లో ఏ తోడు లేకుండా మొదలియార్ కోసం రావాల్సిన అవసరం ఉండేది కాదు..

ఇలాంటి డైలాగ్స్ తో ట్రైలర్ సాగుతుంది. మిథున్ చక్రవర్తి ముంబై అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ గా మంచి లుక్ తో కనపడుతున్నాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేపుతూ సాగుతుంది..

వాడు వీడు ప్రతివాడు నోరు జారారంటే చెడతాడు..ఆచి తూచి మాట్లాడు..నీ మాటే నిన్నెప్పుడు కాపాడు..అనే స్లోగన్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. ఆది నటన, సత్రప్రభాస్ టేకింగ్, షణ్ముగ సుందరం టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్ లో రిచ్ గా కనపడుతున్నాయి. మొత్తం మీద సినిమా అండర్ వరల్డ్ మాఫియాను శాసించే మొదలియార్ అనే వ్యక్తికి, ఓ కాలేజ్ యువకుడికి మధ్య సాగుతుందని, అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనన్నట్లు ఉంది..

Post Your Comment

తాజా వార్తలు