సంపూర్టేష్ బాబు, సనమ్, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు
సంభాషణలు డైమండ్ రత్న బాబు, సినిమాటోగ్రఫీ సతీష్ ముత్యాల, సంగీతం శేషు, స్క్రీన్ ప్లే, కథ, నిర్మాత మంచు విష్ణు, బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, దర్శకత్వం అక్షత్ శర్మ
హృదయకాలేయం తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందిన చిత్రం సింగం 123. ఈ సినిమా స్పూఫ్ చిత్రం అని నిర్మాత మంచు విష్ణు ముందే చెప్పేశాడు. సినిమాని కామెడి యాంగిల్ లోనే చూడాలని కూడా చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాలో సంపూ ఎలాంటి వైబ్రేషనల్ కామెడి చేశాడో చూడాలంటే ముందు ట్రైలర్ రివ్యూ చూద్దాం..ఈ సినిమా పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ. రేసుగుర్రంలో బూచాడే..బ్యాగ్రౌండ్ తో ట్రైలర్ స్టార్టవుతుంది. పోకిరి క్లయిమాక్స్ లో నాజర్ డైలాగ్ లా ఉండే డైలాగ్ తో పోలీస్ బిల్డప్ తో సంపూ ఎంట్రీ స్టార్టవుతుంది. అలాగే తాజ్ మహాల్, సింగాన్ని చూసే కొద్ది చూడాలనిపిస్తుంది, ఏయ్ పిల్లా నేను నచ్చానా, నా గన్ నచ్చిందా వంటి డైలాగ్స్ తో హీరోయన్ సనమ్ తో సంపూ రొమాంటిక్ యాంగిల్ చూపించే ప్రయత్నం. నీకు మెంటల్ రావాలేమో నాకు 365 డేస్ ఆన్ లోనే ఉంటుంది. యముడికి రెస్ట్ ఉండదని ఎన్ కౌంటర్స్ ఆపేశా రీస్టార్ట్ చేయనీయద్దు. ప్రెషర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెషర్ కుక్కర్ లో పప్పుని కాదు. గ్యాస్ స్టౌవ్ పైనా నిప్పుని. బ్రతకండ్రా బతక్రండా అని బతిమలాడితే వినరేంట్రా..కోత మొదలైంది. మీరె వెళ్లేది ఐసియుల్లోకి కాదు. ఐస్ బాక్సుల్లోకే..ఆడవాళ్లకి ఆపదొస్తే అరగంట ఆలస్యంగా అయిన వస్తాను కానీ మగవాళ్లకి ఆపదొస్తే అరక్షణం కూడా ఆగను..ఐ షో దేమ్ హెల్. అంటూ వచ్చే డైలాగ్స్ తో డిఫరెంట్ హీరోస్ ను ఇమిటేట్ చేశాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే స్పూఫ్ డోస్ తెలుస్తుంది. మొత్తం మీద స్పూఫ్ తో పాటు యాక్షన్ డోస్ కూడా ఎక్కువగా కనపడుతుంది. మరి ఈ సినిమాలో ఏ రేంజ్ కామెడి ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Post Your Comment