కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ప్రతిభను ఆమె తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గుర్తించలేకపోయారట. ఒకవేళ గుర్తించి ఉండి ఉంటే ఆమె తప్పకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండేవారట. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదులెండి, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు. రాష్ట్ర విభజన తర్వాత పత్తాలేకుండ పోయిన లగడపాటి ఆదివారం కర్ణాటకలోని పావగడలో కమ్మ హాస్టల్ బాలికల వసతినిలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పురంధేశ్వరిపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘ఈమెకు ఎంతో ప్రతిభ, నైపుణ్యం ఉన్నాయి. ఎన్టీఆర్ ఎందుకో గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఎంతోమంది సీఎంలు అవుతున్నారు. ఆ పదవికి పురంధేశ్వరి అన్ని విధాలా అర్హురాలు’’ అని పేర్కొన్నారు. రాజకీయ సన్యాసం చేసిన గురువుగారికి మళ్లీ ఈ రాజకీయ ఉపన్యాసాలు అవసరమా?. అయిన అంతటి చరిష్మా ఉన్న నేత అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అంత దారుణంగా ఎలా ఓడిపోయింది? చెప్పు గొపాలా?.