మహేష్ ఫ్యాన్ పై రేణు ఫైర్

February 02, 2015 | 03:39 PM | 1277 Views
ప్రింట్ కామెంట్

పవన్ తనయ చిన్నారి ఆద్య ప్రస్తుతం పుణెలో తల్లి రేణు దేశాయ్‌ వద్ద ఉంటోంది. పవన్ కళ్యాన్ పిల్లల బాగోగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, కలిసి రావడం చేస్తూనే ఉంటాడు. తన చిట్టి తల్లి స్కూల్లో డాన్స్‌ ఫంక్షన్‌ కోసం ముస్తాబైందని చెబుతూ రేణు ఆద్య ఫోటో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అచ్చం పవన్ కళ్యాణ్ లా ఉందని చాలా మంది కామెంట్ చేశారు.ఈ స్కూల్‌ ఫంక్షన్‌కి పవన్‌కళ్యాణ్‌ కూడా హాజరై తన కూతురి డాన్స్‌ చూసి మురిసిపోయాడట. ’తల్లి కంటే కూతురి డాన్స్‌ చూడడం తండ్రికే ఎమోషనల్‌ మూమెంట్‌’ అని రేణు దేశాయ్‌ ట్విట్టర్ లో కామెంట్ చేసింది కూడా! అయితే ఇంగ్లీష్ అర్థం కాని కొందరు యాంటీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ టాక్ చేసారు. ‘ఆమె డాడీ చాలా బ్యాడ్. ఫంక్షన్ కి హాజరు కాలేదు. మంచి డాడీ అంటే ఇలా ఉండాలి' అంటూ మహేష్ బాబు తన కొడుకు గౌతం స్కూలుకి వెళ్లిన ఫోటో పోస్టు చేసాడు. అతడి కామెంటుతో ఆగ్రహానికి గురైన రేణు ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘ముందు నువ్వు స్కూలుకు వెళ్లి ఇంగ్లీషు సరిగా నేర్చుకో. నీ స్టుపిడ్ కామెంట్స్ చేసే ముందు పర్ ఫెక్టుగా ఇంగ్లీషు నేర్చుకో. నేను నా ట్విట్లో ఆద్యా డాడీ కూడా అక్కడ ఉన్నట్లే చెప్పాను. ఇలాంటి చెత్త కామెంట్స్ చేసే ముందు ఇంగ్లీష్ నేర్చుకుని రండి' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ