ఐరెన్ లెగ్ లేడీకి అంత సీనుందా?

April 24, 2015 | 05:26 PM | 1282 Views
ప్రింట్ కామెంట్
Taapsee_pannu_bollywood_movie_producing_niharonline

రింగు జుత్తుల సుందరి తాప్సీ పన్ను. ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా టాలీవుడ్ తెరంగ్రేటం చేసిన ఈ అమ్మడికి ఇక్కడ సక్సెస్ లేదనే చెప్పాలి. మొగుడు, షాడో, వీర, ఇలా వచ్చిన చిత్రాలు వచ్చినట్లు ఫ్లాపులు మూటకట్టుకుని ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. సాహసం, మిస్టర్ ఫర్ ఫెక్ట్ కాస్త ఊరటనిచ్చిన పెద్ద లాభం లేకపోయింది. కానీ, పరభాషల్లో మాత్రం ఈ అమ్మడికి మాంచి సక్సెస్ రేట్ ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ లో. ఇలా సౌత్ చిత్రాలతోపాటు ఆడపదడపా ఉత్తరాది చిత్రాల్లో నటిస్తు కెరీర్ ను బాగానే మెయింటెన్ చేస్తుంది. ఇక ఇఫ్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు నిర్మాణ రంగంలోకి దిగబోతుందట. ఇటీవలె కాంచన-2 (తెలుగులో గంగ) ద్వారా అదిరిపోయే ఫెర్మామెన్స్ ఇచ్చిన ఈ పన్ను తాజాగా ఆ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తుందట. ఇందుకు గానూ గ్రేట్ బాలీవుడ్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో కలిసి నిర్మాణ సారథ్యంలో భాగం పంచుకునేందుకు రెడీ అయిందట. బాలీవుడ్ లో ఇటీవలె ఎన్ హెచ్-10 చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి అనుష్క శర్మ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు తాప్సీ కూడా నిర్మాణ రంగంలోకి దిగేందుకు ఇంట్రస్ట్ చూపుతుందట. ఆల్ ది బెస్ట్ తాప్సీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ