ఇకపై ఎన్టీఆర్ వైద్య సేవ

November 18, 2014 | 05:09 PM | 94 Views
ప్రింట్ కామెంట్

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేరును ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ‘‘ఎన్టీఆర్ వైద్య సేవ’’గా మార్చింది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో వ్యాధుల సంఖ్యను 938 నుంచి 1038కు పెంచడంతోపాటు వైద్య సేవ కింద అయ్యే ఖర్చు పరిమితి రూ. 2.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సుమారు ఐదుగంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో దీనితోపాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ