ఈ మధ్య కాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని రిలీజ్ డేటును పోస్టుపోన్ చేసుకుంటూ వచ్చిన సినిమా ఉత్తమ విలన్. మత పరంగా మనోభావాల్ని దెబ్బతీసిందంటూ కోర్టులో వేసిన కేసు నుంచి బయట పడి అన్ని అవాంతరాలూ దాటుకుని చివరికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది కమల్ హాసన్ చేస్తున్న మరో విశిష్ట, విభిన్నమైన చిత్రం. నటుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టాడు. సినిమా టైటిల్ లోనే ఓ వైవిద్యం చూపిస్తూ ఎన్నో రోజులుగా అభిమానులను ఊరిస్తూ చివరికి కార్మికుల రోజైన మేడే రోజున అభిమానులకు పండగ చేయనుంది. తమిళ నాట పేరున్న దర్శకుడు లింగుస్వామి ఈ సినిమా నిర్మాణ కర్తల్లో ఒకరు. కమల్ సినీ గురువు, దర్శకుడు కె. బాల చందర్ ఈ సినిమాలో తన పాత్రను తానే పోషించారు. కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు ఈ సినిమాలో కమల్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి కళాకారుడి పాత్ర. విశ్వరూపంలో కమల్ సరసన కీలక పాత్ర పోషించిన ఆండ్రియా ఈ సినిమాలో కూడా నటించింది.
ఈ చిత్రంలో హీరో నాగ చైతన్య కంటే ముందు చెప్పుకోవాల్సింది డైరక్టర్ సుధీర్ వర్మ గురించి. స్వామి రారా వంటి సింపుల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి టాలీవుడ్ ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకున్నాడు. సగటు ప్రేక్షకుడు స్ర్కీన్ ప్లే పట్ల బోరింగ్ గా ఫీలవుతున్న టైంలో ఓ ఢిపరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాడు. అదే దోచేయ్. కాకపోతే ఇందులో కూడా దొంగతనం నేపథ్యంలోనే కథను నడిపే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక నాగచైతన్య ఒక లైలా కోసం లాంటి డీసెంట్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం. లవర్ బాయ్ ట్యాగ్ లైన్ నుంచి దొంగగా మారి అలరించేందుకు సిద్ధమయిపోతున్నాడు. ఇక హీరోయిన్ కృతిసనన్. మహేష్ వన్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం అయినప్పటికీ పరిణితి చెందిన నటనను కనబరిచింది. ఇక ఇప్పుడు తన క్యూట్ యాక్టింగ్ తో అలరించేందుకు ముందుకు వచ్చేస్తుంది. చిత్రంలో ఒక్క బ్రహ్మానందం, రావు రమేష్, పోసాని తప్ప మిగతా వారంతా స్వామిరారా టీం వారే. మరి ఈ క్రైమ్ థిల్లర్ తో సుధీర్ హిట్ అందుకుంటాడా? కొత్త దర్శకుడి రెండో చిత్రం ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ నుంచి తప్పించుకుంటాడా? వెయిట్ అండ్ సీ.
విలువలె ఆస్తి అంటూ త్రివిక్రమ్ మ్యాజిక్ తో వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సన్నాఫ్ సత్యమూర్తి . రేసు గుర్రంలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డు నెలకొల్పిన త్రివిక్రమ్ మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసే చేసిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జులాయి వంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో చూడాలి.
హర్రర్ కాన్సెప్ట్ తో తెరకక్కిన చిత్రం. గతంలో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ గా రూపొందింది. హర్రర్ చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన రవిబాబు ఈ సీక్వెల్ లో ప్రేక్షకులను ఏ మేర భయపెడతాడో చూడాల్సిందే..