ఫ్రైడే రిలీజెస్

furious
movie image view

చంద్రిక

శ్రీముఖి-కామ్నా జఠ్మలానీ కలిసి నటించిన సినిమా చంద్రిక. ఈ హారర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25న తెరమీదకు రాబోతోంది. యోగేష్‌ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. కార్తీక్‌ జయరామ్‌ ఇందులో హీరోగా నటిస్తుండగా గిరీష్ కర్నాడ్ ఓ ప్రత్యేక పాత్రలో చేస్తున్నారు. ఎల్‌.బి.శ్రీరాం, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

furious
movie image view

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

మెగా అభిమాన డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు మెగా మేనల్లుడితో చేసిన సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.  ఈ సినిమా రొమాంటిక్ అండ్ ఎంటర్ టైనింగ్ మూవీ గా రూపుదిద్దుకున్నది. ఈ సినిమాలో పిల్లా నువ్వులేని జీవితం హీరోయిన్ రెజీనా కసాండ్ర ఇందులోనూ సాయి తో జతకట్టింది. సుమన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమానూ మంచి టేస్ట్ ఉన్న నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. 

furious
movie image view

హోరాహోరీ

చిత్రంతో ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్తవారికి లైఫ్ ఇచ్చి ఆ తర్వాత నవ్వు నేను, జయం లాంటి విభిన్నమైన ప్రేమకథలను తెరకెక్కించి తెలుగు ఇండస్ట్రీకి మరిచిపోలేని హిట్లను అందించాడు దర్శకుడు తేజ. అంతా కొత్తవాళ్లతోనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్లు అందుకోవటం తేజకు అలవాటయిన ప్రయత్నమే. కానీ దాదాపు పది సంవత్సరాలుగా తేజ సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద సందడి చెయ్యలేదు. పరాజయాలతో డీలాపడ్డ తేజకి అలామొదలైంది, అంతకుముందు ఆ తర్వాత చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ తొడైంది. దీంతో హోరాహోరీ అనే ఓ ప్రేమకథను ప్రేక్షకులకు అందించేందుకు ముందుకు వచ్చాడు.

దిలీప్, దక్ష జంటగా తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టి తీరతానని తేజ ధీమాగా ఉన్నాడు. అగ్ర నిర్మాత సురేష్ బాబు కూడా ఆఖరి నిమిషంలో చిత్ర భాగస్వామిగా చేరడం చిత్రం హిట్ అవుతుందనే నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. కళ్యాణ్ కోడూరి సంగీతం అందించిన ఈ పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది.

furious
movie image view

భలే భలే మొగాడివోయ్

ఇది కామెడీ చిత్రమని తెలుస్తోంది. ఇందులో నాని మతిమరుపు హీరో... తన మతి మరుపును కవర్ చేసుకోడానికి అబద్దాల మీద అబద్దాలు చెపుతుంటాడు. ఈ సినిమాను నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకోవడంపై ఈసినిమా మీద వారికి చాలా కాన్షిడెన్స్ ఉందనేది అర్థ మవుతోంది. కామెడీ బాగా పండించగల నానికి, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి కూడా ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుందని టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది

furious
movie image view

డైనమైట్

అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డైనమైట్’. దేవాకట్టా దర్శకుడు . అచ్చు సంగీతం అందించాడు. ఈ చిత్రం తమిళంలో వచ్చిన అరిమ నంబి కి రీమేక్ గా తీశారు. తమిళంలో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ నటించారు.  యాక్షన్ ఎంటర్ టైనింగ్ మూవీస్ ను ఇష్టపడే ప్రేక్షకులకు మంచు విష్ణు రూపొందించిన డైనమైట్ తప్పకుండా నచ్చుతుంది. మంచు విష్ణు చేసిన రిస్కీ ఫైట్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. కొన్ని సన్నివేశాలు ఇప్పటి వరకు సెల్యూలాయిడ్ పై చిత్రీకరించిన రీతిలో తెరకెక్కించారట. 

furious
movie image view

జయసూర్య

పందెంకోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు విశాల్ బాగా తెలసు. తెలుగు వాడే అయినా చెన్నయ్ లో సెటిల్ అయ్యి తమిళ హీరో అయిపోయాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో ‘పాయుమ్ పులి'గా తమిళంలో రూపొందించిన చిత్రం తెలుగులో ‘జయసూర్య'గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విశాల్ కనిపిస్తాడు.