ఫ్రైడే రిలీజెస్

furious
movie image view

జేమ్స్ బాండ్

ఈ సినిమాలో రక్తం చూస్తే కళ్లు తిరిగిపడిపోయేంత భయస్తుడు అల్లరి నరేష్. అలాంటి అబ్బాయికి రక్తం చూస్తే తప్ప నిద్రపట్టని ఓ లేడీడాన్‌తో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అనేదే స్టోరీ లైన్. 

furious
movie image view

బాహుబలి

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇంతవరకూ ఏ తెలుగు సినిమాను చేయనంత భారీ వ్యయం దాదాపు 250 కోట్లు ఈ సినిమాకు ఖర్చు చేశారు. ఒక హాలీవుడ్ సినిమాకు ఏ విధంగానూ తీసిపోని విధంగా టెక్నికల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది. బాహుబలి పార్ట్ 1 ఒక్క తెలుగులోనే ఇప్పటి వరకు దాదాపు 83 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రిలీజ్ ముందే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగలేదు. శాటి లైట్ రైట్స్, ఇతర రైట్స్ ఇలా అన్ని కలిపి పార్ట్ 1 ఇప్పటికే 125 కోట్ల బిజినెస్ చేసింది. ఇక తెలుగు, తమిళం, మళయాలం, విదేశీ వెర్షన్లు కలిపితే ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించడం ఖాయం.

ఇక కథ విషయానికి వస్తే ఇది ఒక జానపద మూవీగా చెప్పుకోవచ్చు. కథ ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ట్రూలర్ చూసిన వాళ్ళంతా కథ గురించి చాలా ఊహాగాలు మొదలయ్యాయి. ఈ కథలో అన్నదమ్ములు, కత్తులు, యుద్ధాలు... రాజనీతి వంటివి కనిపిస్తున్నాయి. 
 

furious
movie image view

టైగర్

ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సందీప్ కిషన్ ది ఫుల్ మాస్ మరియు ఎనర్జిటిక్ కారెక్టర్. తమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే ఉంటుందన్నారు ఈ చిత్ర దర్శకుడు.

furious
movie image view

జాదూగాడు

జాదూగాడు నాగశౌర్యకు మొదటి యాక్షన్ సినిమా. విలన్లను మట్టుబెట్టే జాదూగాడుగా ఇందులో నటిస్తున్నాడు. హీరోయిన్ ని మెప్పించే కలల రాకుమారుడిగా  కనిపిస్త4ాడు. మొత్తంగా ఇది ఒక  రోమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాకి దర్శకత్వం యోగేష్ చేస్తుండగా... ఈ చిత్రానికి సంగీతాన్ని మణిశర్మ కుమారుడు మహతి సమకూర్చారు.

furious
movie image view

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందనే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రమే కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. కృష్ణ, రాధలు ఒకే క్లాస్ మేట్స్. చిన్నప్పటి నుండి కృష్ణ, రాధను ప్రేమిస్తాడు. అయితే ఆమె గైడెన్స్ తో గొప్ప స్థాయికి ఎదుగుతాడు. మరి తన ప్రేమను గెలిపించుకున్నాడా..తన ప్రేమ నిజమైనదేనా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

furious
movie image view

టిప్పు

విదేశాల్లోని యువకుడు ఇండియాలోని మైసూర్ కి ఒక ముఖ్యమైన పనిమీద వస్తాడు. అక్కడ ఓ సందర్భంలో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. అసలు ఫారిన్ నుండి హీరో ఇండియాకి ఎందుకు వస్తాడనేదే కథాంశం.