ఫ్రైడే రిలీజెస్

furious
movie image view

రుద్రమదేవి

కాకతీయ సామ్రాజ్య పట్టపు రాణి రుద్రమదేవి గురించిన కథను తెరకెక్కించారు దర్శకుడు గుణ శేఖర్. ఈ సినిమాను తీయాలని ఆయన పదేళ్ళుగా కలలు గన్నానని చెప్పుకున్నారు. 40 ఏళ్లుపాటు ప్రపంచంలో ఏ రాణి పరిపాలించని విధంగా పరిపాలించిన రుద్రమదేవి కథాంశాన్ని తీసుకున్నారు. పాత్రలకు తగినట్టుగా నటీ నటుల ఎంపిక జరిగింది. రుద్రమదేవిగా అనుష్క ఈ పాత్రలో చక్కగా ఇమిడిపోయింది. మరో ప్రత్యేకమైన పాత్రలో  గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించగా, చాళుక్య వీరభద్రునిగా రానా నటించారు. చిత్రంలో తెలంగాణ భాషను ఉపయోగించడం మరో విశేషం. గుణ శేఖర్ ఎంతో ఫైనాన్షియల్ సమస్యలను ఎదుర్కొని ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి దాదాపు ఆయన 70 కోట్లు ఖర్చు చేయడం విశేషం. తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ కావడంతో ముఖ్యమంత్రి ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చి గుణశేఖర్ కు ఊరట నిచ్చారు.

furious
movie image view

శివం

రామ్ పండగ చేస్కో అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ‘శివం’ సినిమాను ఓ ఛాలెంజ్ గా తీసుకుని చేశారు. రామ్ కు జోడీగా రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ నటించింది. ఈ  సినిమా పూర్తి యాక్షన్ లవ్ స్టోరీగా ఉండబోతోందంటున్నారు. రామ్ సినిమాలో ఎంత ఎనర్జిటిక్ యాక్షన్ ఉంటుందో.. సినిమా చివరి వరకు కూడా అదే ఎనర్జీని కొనసాగించడం టాలీవుడ్ లో చాలా మందికి నచ్చే అంశం. అనుకున్న స్థాయి హిట్ లేని రామ్.. శివం సినిమా కోసం బాగా కష్టపడ్డారట. శివం సినిమాలోని మూడు పాటలను యూరప్ లో షూట్ చేశారు. ఈ చిత్రం ట్రైలర్ కు, ఆడియోకు ఇప్పటికే మంచి క్రేజ్ రావడంతో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. 

furious
movie image view

పులి

కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరంటే టక్కున చెప్పే పేరు ఇళయ దళపతి విజయ్. యూత్ లో ఉన్న క్రేజ్ కారణంగానే విజయ్ స్టార్ డమ్ ఈరోజు ఇంత స్థాయికి ఎదిగిందనటంలో సందేహం లేదు. ఇక ఈ ఏడు కోలీవుడ్ ప్రజలు ఎదురుచూస్తున్న చిత్రం పులి. విజయ్ హీరోగా శంకర్ శిష్యుడు చింబుదేవన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అందాల తారలు శృతిహాసన్, హన్సికలు నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ పులి అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చాలా రోజుల తర్వాత లెజెండరీ నటి శ్రీదేవి పులి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఇక విలన్ పాత్రలో కన్నడ స్టార్ నటుడు సుదీప్ నటిస్తున్నాడు. పీ.టి సెల్వ కుమార్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాకింగ్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు. బడ్జెట్ తోపాటు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తమిళంలో 700 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతుండగా, తెలుగులో 800 థియేటర్లలో రిలీజ్ చెయ్యటం విశేషం. మరి ఇది మరో బాహుబలి అవుతుందా? ఈ పులి గాండ్రింపు ఏ స్థాయిలో ఉంటుందో రేపు తెలిసిపోతుంది.

furious
movie image view

కేటుగాడు

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చెయ్యటంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. అదే కోవలో లేటేస్ట్ గా వచ్చిన చిత్రమే కేటుగాడు. ప్రకాశ్ రాజ్ ఉలవచారు బిర్యానితో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తేజస్ హీరో, షార్ట్ ఫిల్మ్స్ తో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన నటి చాందిని చౌదరి. వీరిద్దరు జంటగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వెంకటేష్ మూవీస్ పతాకంపై వెంకటేష్ బాలసాని ఈ సినిమాను నిర్మించారు. హీరోయిన్ కిడ్నాప్ డ్రామాగా ఈ చిత్రం మొత్తం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. మధ్యలో సప్తగిరి కామెడీ ని బట్టి ఎంటర్ టైన్ మెంట్ కూడా బాగానే ఎక్స్ పెక్ట్ చెయ్యోచ్చని అర్థమౌతుంది. ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 18న)  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

furious
movie image view

కొరియర్ బాయ్ కళ్యాణ్

ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి వరుస హిట్స్ తో ఫాంలోకి వచ్చిన నితిన్ ఆ తర్వాత హర్ట్ ఎటాక్, చిన్నదాన నీకోసం తో కాస్త తగ్గాడు. సినిమాలు సో సోగా ఆడినా అవి నితిన్ కి పెద్దగా పేరు తేలేకపోయాయి. అలాంటి నితిన్ తో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందింది. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ్ సాయి దీనిని తెరకెక్కించాడు. ప్రీమియమ్ రష్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది. అదే కొరియర్ బాయ్ కళ్యాణ్. కానీ, ఏమైందో తెలీదు కానీ చాలా కాలంగా రిలీజ్ కి నోచుకోలేదు. చివరికి అన్ని కుదిరి సెప్టెంబర్ 17న వినాయకచవితి సందర్భంగా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా ఏమేర ఆకట్టుకుందో  చూడాలి.

furious
movie image view

మయూరి

కోలీవుడ్ లో ఈ మధ్య హార్రర్ చిత్రాల జోరు కొనసాగుతుంది. అవన్నీ హిట్లుగా నిలవటంతోపాటు అదే రేంజ్ లో భయపెడుతున్నాయ్ కూడా. అదే టైంలో వచ్చిన మరో హర్రర్ చిత్రమే మయూరి. కెరీర్ మొదటి ఇన్నింగ్స్ టాప్ హీరోలతో గ్లామర్ పాత్రలను చేసుకుంటూ వచ్చింది నయనతార. అయితే సెకండ్ ఇన్నింగ్స్ శ్రీరామరాజ్యం తర్వాత ఆమెలో చాలా మార్పు వచ్చింది. క్యారెక్టర్, కంటెంట్ ఉంటే చాలు చిన్న హీరోలతోనైనా నటించేందుకు సిద్ధమైపోతుంది. ఇదే క్రమంలో తమిళంలో షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కింది. అదే మయూరి. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హర్రర్ చిత్రంగా తెరకెక్కిన మయూరి వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.