నలుగురు అబ్బాయిలు, అమ్మాయిలు కలిసిన రొమాంటిక్ సినిమా ఇది. ప్రేమికులతో కామెడీని మిక్స్ చేసిన తీసిన చిత్ర మిది. నవ్విస్తూనే చక్కటి క్లైమాక్స్ ని అందిచాడట దర్శకుడు అరుణ్ పవర్. సెకండాఫ్‌లో సప్తగిరి వచ్చి చేసే కామెడి కి ధియోటర్ మెత్తం విజిల్స్ పడతాయంటున్నారు. అయితే కేవలం నవ్వుకునే వాళ్ళు మాత్రమే ఈ చిత్రానికి రావాలని మా విన్నపం. అని అంటున్నారు అరుణ్ పవర్.
'కిక్'లో హీరో పేరు కల్యాణ్. 'కిక్' అంతా వాడి గోలే. ఇది వాళ్ల అబ్బాయి రాబిన్ హుడ్ కథ. వీడిదంతా 'కంఫర్ట్' గోల.. అదేంటన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది అన్నారు. ఈ చిత్రం తో తప్పకుండా డబుల్ కిక్ ఇస్తామంటున్నాడు రవితేజ.
ఇంతకు ముందు ఉయ్యాల జంపాలలో నటించిన హిట్ పెయిర్ తో ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం కూడా లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా చిత్రీకరించారు. ఇందులోని కామెడీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనీ, హీరో, హీరోయిన్లు మరింత మెచురిటీగా ఈ సినిమాలో నటించారని ఈ చిత్ర నిర్మాత, దర్శకులు చెపుతున్నారు.
ఉపేంద్ర హీరోగా నటించిన ఉపేంద్ర చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన ఉపేంద్ర సినిమాకు సీక్వెల్‌గా కన్నడంలో ఉప్పి-2 పేరుతో మళ్ళీ తీశారు. ఈ సినిమా ఉపేంద్ర 2 గా తెలుగులో రిలీజ్ చేశారు. అప్పటి ఉపేంద్ర నేను అనే కాన్సెప్ట్ తో తీస్తే ఈ సినిమా నువ్వు అనే కాన్సెప్ట్ తో తీశారు. అందుకే సబ్ టైటిల్ గా నేను కాదు నవ్వు అని పెట్టారు.
శ్రీమంతుడు సినిమాకు ఇప్పటి వరకూ ఏ సినిమా తీసుకోని ఓ కొత్త కాన్సెస్ట్ తో కథను అందిస్తున్నారు. మహేష్ బాబు చాలా ధనవంతుడు. ఓ ఊరిని దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు తన అండదండలు అందించాలని అనుకుంటాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కొందరు శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సోషల్ మెసేజ్ ను అందిస్తూ కమర్షియల్, లవ్ ఎలిమెంట్స్ ను కథకు జోడించారు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరింత వన్నె తెచ్చేలా కనిపిస్తోంది. వరుసగా రెండు ఫ్లాప్ లు ఇచ్చి మహేష్ అభిమానులను నిరాశ పరచడంతో, తన ఫాన్స్ కు సారీ చెప్పుకుని మరీ ఈ సినిమాను చాలా కేరింగ్ గా చేసినట్టు కనిపిస్తోంది. దర్శకుడు కొరటాల శివ సక్సెస్ కోసం ఎంత కష్టపడి సినిమా తీశాడో... అంత కంటే ఎక్కువ రిస్క్ తీసుకుని మహేష్ బాబు నటించినట్టు దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు కూడా.
కథ, కథనం ఈ సినిమాకు హీరో హీరోయిన్లు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో సాగే కథ ఇది. ట్రైలర్ ను బట్టి ఏదో డబ్బుకోసం అడవుల్లో సంచారం చేస్తున్నట్టు సాగుతుంది. ఇందులో ఓ విలన్ ఆ విలన్ బారిన పడుతున్న అమాయకులు... మధ్యలో పోలీస్ ఆఫీసర్ గా నాగబాబు.. అంతా సస్పెన్స్ తో నడుస్తుంది.. కథ ఏమిటో తెరమీద చూడాల్సిందే...