ఫ్రైడే రిలీజెస్

furious
movie image view

పండగ చేస్కో

రామ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వరుస విజయాలు సాధించిన డైరక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పండగచేస్కో. ఇక వరస ఫెయిల్యూర్స్ తో ఉన్న రామ్ 'పండగ చేస్కో' పై గంపెడాశలు పెట్టుకున్నాడు. కామెడీ ట్రాక్ ప్రధానాంశంగా ఎంటర్ టైనింగ్ గా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తేనే అర్థమౌతోంది. మే 29న ఈ చిత్రాన్ని ధియోటర్లలలో దించుతున్నారు. ఈ చిత్రంపై ఆయన చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రమైనా రామ్ కి హిట్టు దాహం తీరుస్తుందా రేపు తెలియనుంది.

furious
movie image view

రాక్షసుడు

తెలుగులో సూప‌ర్బ్ క్రేజీ హీరోగా ఇమేజ్ ని సొంతం చేసుకున్న సూర్య‌, గ్లామ‌ర‌స్ క్వీన్ న‌య‌న‌తార, హాట్ బ్యూటీ ప్రణీత జంట‌గా, విభిన్నమైన కథనాలతో చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు వెంక‌ట్ కాంబినేషన్లో తమిళంలో రూపొందిన చిత్రం మాస్. ఈ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడుగా రిలీజ్ చేయబోతున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికే విడుదలై హిట్టయ్యాయి. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం శుక్రవారం మే 29 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ చిత్ర ఫలితమేంటో రేపు తేలనుంది.

furious
movie image view

ఎంతవాడు గానీ

ఫిబ్రవరిలో తమిళంలో ఘనవిజయం సాధించిన అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్ ను అప్పట్లోనే తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో గ్యాప్ తీసుకుని ఎంతవాడుగాని పేరుతో ఇప్పుడు విడుదలైంది. గౌతమ్ మీనన్ యాక్షన్ సినిమాలను కూడా డిఫరెంట్ స్టయిల్ లో ప్రజెంట్ చేస్తాడనే విషయం తెలిసిందే. అలాంటి స్టయిలిష్ టేకింగ్ తో తమిళంలో ఈ చిత్రం యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసింది. దాంతో నిర్మాత తెలుగులో కూడా అజిత్ చిత్రాన్ని భారీ అంచనాలతో, ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. 

furious
movie image view

మోసగాళ్లకు మోసగాడు

మోసగాళ్లకు మోసగాడు 1971 లో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం. మెకన్నాస్ గోల్డ్  తరహాలో వచ్చిన మొదటి కౌబాయ్ చిత్రం. అంతేకాదు ఈ చిత్రం ద్వారా తెలుగు చలన చిత్రస్థాయిని అంతర్జాతీయ లెవల్లోకి తీసుకెళ్లారు. మరి అలాంటి టైటిల్ తన చిత్రానికి వాడుకున్నాడు కృష్ణ అల్లుడు సుధీర్ బాబు. చిన్న చిన్న చిత్రాలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్న సుధీర్ హీరోగా, స్వామిరారా చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నూతన దర్శకుడు ఏఎన్ బోస్. నందిని ఈ చిత్రంలో హీరోయిన్ గా నడుస్తుంది. స్వామిరారా తరహాలోనే ఓ విగ్రహా నేపథ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. అంతేకాదు ఈ చిత్రంలో మంచు మనోజ్ ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నాడట. మరి ఇన్ని విషయాలున్న ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఆల్ ది బెస్ట్ టూ మోసగాళ్లుకు మోసగాడు టీం.  

furious
movie image view

దొంగాట

మంచు లక్ష్మి నటించి, నిర్మించిన చిత్రం ‘దొంగాట’. అడివి శేష్‌, బ్రహ్మానందం, మధు నందన్‌, ప్రభాకర్‌ లు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విద్యానిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకుడు. ఈ నెల 1న విడుదల కావాల్సిన ఈ సినిమా అవాంతరాలు, అడ్డంకులను ఎదుర్కొని మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని సంకల్పించారు. ఈ సినిమా డబ్బుకి , మనిషికి మధ్యగల సంబంధం నేపధ్యంలో తెరకెక్కించారు. దీనికి మహావీర్‌, సాయికార్తీక్‌, రఘు కుంచెలు సంగీత దర్శకులుగా పని చేశారు. పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘యాందిరో’ పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. తొమ్మిది మంది హీరోలతో చిత్రీకరించిన మరో పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాయి మాధవ్‌ సంభాషణలు మనసుకు హత్తుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి ఆద్యంతం నవ్వించే నవ్వించేలా ఉంటుందంటున్నారు  ఈ చిత్ర యూనిట్. ఇందులో ఓ ప్రత్యేక సందర్భంలో నాగార్జున, రవితేజ, రానా, నాని, శింబు, సుధీర్‌బాబు, నవదీప్‌, సుశాంత్‌, తాప్సీ ఓ డాన్స్ సీన్ లో కనిపిస్తారు.

furious
movie image view

గంగ

లారెన్స్ రాఘవ ఆలోచనల్లోంచి పుట్టిన మరో థ్రిల్లర్, కామెడీ మూవీ గంగ (కాంచన 2). మునీ సీక్వెల్ గా వచ్చిన మూడో సినిమా ఇది. మొదట ముని 3 టైటిల్ అనుకున్నారు, తరువాత కాంచన్ 2గా మార్చారు చివరికి గంగ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఆర్థిక ఇబ్బందులో మునిగి తేలి చివరికి తెలుగు వర్షన్ మేడే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో తాప్సి , నిత్యామీనన్ లు నటించారు. ఫస్ట్ లుక్, టీజర్లతోనే జనాలను భయపెట్టిన ఈ సినిమా తెరమీద చూసిన ప్రేక్షకుల ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందో నని క్రిటిక్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ లారెన్స్ తీసిన అన్ని థ్రిల్లర్ సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టినవే. ఈ సినిమా కూడా తమిళ నాట మంచి మార్కులు వేయించుకుంది. అక్కడ సక్సెస్ అయినప్పుడు తెలుగులో కూడా కాసుల వర్షం కురిపించడం ఖాయమని సినీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తమిళ్ వెర్షన్ లో ఈ సినిమా ఏప్రిల్ 17 న విడుదల అయ్యి మంచి హిట్ అందుకుంది.