ఫ్రైడే రిలీజెస్

furious
movie image view

వినవయ్యా రామయ్యా

హీరో చిన్న చిన్న అబద్ధాలు చెబుతుంటాడు. పన్ లవింగ్ క్యారెక్టర్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం. ఇందులో హీరో దేవుడైన శ్రీరాముడికి చెప్పుకుంటాడు. అలాంటి హీరోకి శ్రీరాముడు ఏం చేసాడనేదే కథ. ఇందులో క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది.

furious
movie image view

జ్యోతిలక్ష్మీ

టెంపర్ వంటి సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ జ్యోతిలక్ష్మీ. మంత్ర వంటి సక్సెస్ తర్వాత ఛార్మి చేస్తున్న వుమెన్ సెంట్రిక్ మూవీ ఇది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో ఛార్మి నటించింది. ఛార్మిని హీరో సత్య ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరి ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. తనకి ఎదురైన సమస్యను జ్యోతిలక్ష్మీ ఎలా ఎదుర్కొందనేది కాన్సెప్ట్.

furious
movie image view

కేరింత

కాలేజీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల చదువుకోడానికి కాలేజ్ లో చేరుతారు. దాని వల్ల వారి జీవితాల్లో ఏ మార్పులు చోటు చేసుకున్నాయి. వారి స్నేహం ఎలాంటి మలుపులు తీసుకుందో తెలుసుకోవాలంటే సినిమా చూడ్సాల్సిందే.

furious
movie image view

ఆంధ్రా పోరి

మరాఠీలో విజయవంతమైన టైమ్ పాస్ చిత్రానికి రీమేక్ ఆంధ్రాపోరి. నిజామాబాద్ కి చెందిన నర్సింగ్ యాదవ్(ఆకాష్ పూరి), ఆంధ్ర ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. తన లవర్ ని ముద్దుగా నర్సింగ్ పిలుచుకునే పేరే ఆంధ్రాపోరి. ప్రతి వ్యక్తి జీవితంలో తొలి ప్రేమ మధుర స్మృతిగా మిగిలే ఉంటుంది. ఈ సినిమా చూస్తే అటువంటి ఫీల్ కలుగుతుందని చిత్రయూనిట్ చెబుతుంది. 

furious
movie image view

అసుర

ధర్మ(నారారోహిత్) పనిరాక్షసుడు. తన పనికి ఎవరైనా అడ్డు వస్తే ఒప్పుకునే రకం కాదు. వారితో ఎంతవరకైనా పోరాడే తత్వముండే జైలర్. మరి అలాంట మనస్తత్వముండే జైలర్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. బాణం, రౌడీఫెలో చిత్రాల తర్వాత పోలీస్ ఆఫీసర్ గా నారారోహిత్ చేస్తున్న చిత్రమిది. అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే, కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అందుకే నిర్మాతగా కూడా మారి ఈ చిత్రాన్ని చేశానని రోహిత్ అన్నాడు. ఈ సినిమా రస్టిక్ లుక్ కోసం కలర్ టు షేడ్స్ తగ్గడమే కాకుండా హెయిర్ స్టయిల్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని కృష్ణ విజయ్ తో గతంలో మద్రాసి చిత్రం చేయాల్సిందని, కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయిందని ఇప్పుడు ఈ సినిమాతో కుదిరిందని నారారోహిత్ చెప్పుకొచ్చాడు. 

furious
movie image view

సింగం 123

హృదయకాలేయం చిత్రం తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన చిత్రం సింగం 123. ఒక గ్రామంలో విలన్ ఆగడాలను ఆరికట్టేందుకు ప్రభుత్వంచే నియమించబడే పోలీస్ సింగం 123. మరి విలన్ ను సింగం ఎలా ఎదుర్కొన్నాడు. ఏం చేశాడనేదే సినిమా. స్ఫూఫ్ సినిమాగా అందరూ నవ్వుకునే విధంగా ఈ సినిమా రూపొందిందని నిర్మాత విష్ణు ఇప్పటికే తెలియజేశాడు. సో ..సంపూ కామెడినీ రేపే థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలంటే వెయిట్ చేయాల్సిందే...