ఫ్రైడే రిలీజెస్

furious
movie image view

అఖిల్

మరో నటవారసుడు మరి కొద్ది గంటల్లో మనముందుకు రాబోతున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి రెండు కళ్లుగా భావించిన ఎన్టీఆర్, ఎఎన్నారలలో అక్కినేని వారసుడిగా ఆరంగ్రేటం చేయబోతున్నాడు అఖిల్. బాలనటుడిగా ఊహ తెలిని వయసులోనే సిసింద్రీలో నటించి అందరినీ మెప్పించాడు. ఇక ఇప్పుడు స్టార్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్' గా మన ముందుకు రాబోతున్నాడు.  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అఖిల్ స‌ర‌స‌న బాలీవుడ్ అల‌నాటి న‌టుడు దిలీప్‌కుమార్‌-సైరాభాను మ‌న‌వ‌రాలు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇక అంతా ఊహిస్తున్నట్లు ఇది ఇది సోషియో ఫాంటసీ చిత్రం కాదుట, ఫైట్స్... డాన్స్ ఉన్న మంచి కామెడీ ఎంటర్టెనర్ అని చిత్ర యూనిట్ చెబుతోంది.

అక్కినేని ఫ్యామిలీలో మూడోత‌రం నట వారసుడు అఖిల్ సినిమాను చూసేందుకు అక్కినేని ఫ్యాషన్ తో పాటు ప్రతీ ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకుడు ఆస‌క్తితో ఉన్నారు. స్క్రీనింగ్ టైం ద‌గ్గర ప‌డుతున్న కొద్ది అఖిల్ తోపాటు, అక్కినేని కుటుంబ సభ్యుల్లో టెన్షన్ పెరుగుతోంది. దీపావళి కానుకగా మరి కొద్ది గంటల్లోనే ఇది మన ముందుకి రానుంది. రివ్యూ కోసం నీహార్ ఆన్ లైన్ ను చూడండి.

furious
movie image view

త్రిపుర

“గీతాంజలి” దర్శకుడు రాజ్ కిరణ్ మరో లేడీ ఓరియెంటల్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. అదే త్రిపుర. కలర్స్ స్వాతీ, నవీన్ చంద్ర లీడ్ రోడ్ లో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ యువతికి వచ్చే కలల ఆధారంగా ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది ఈ చిత్రం. క్రేజీ మీడియా పతాకం పై  చిన బాబు అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. విడుదలకు ముందే ప్రీ బిజినెస్ కూడా లాభాలతో సాగటం చిత్ర యూనిట్ కు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. మరీ చిత్రం ఎలా ఉండబోతుందో మరి కొద్ది గంటల్లోనే తెలియనుంది. రివ్యూ కోసం నీహార్ ఆన్ లైన్ చూస్తూ ఉండండి.

furious
movie image view

షేర్

పటాస్  సినిమా తో  హిట్ ట్రాక్  లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఫుల్  జోష్ మీద కనిపిస్తున్నాడు. గతంలో తనతో అభిమన్యు, కత్తి లాంటి చిత్రాలు తీసిన దర్శకుడు మల్లికార్జున దర్శకత్వం  లో  ‘’షేర్’’ సినిమాను రెడీ చేశాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం (అక్టోబర్ 30న) విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు తన కుటుంబానికి ఎదురైన సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు. అదే టైంలో తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు. అన్నదే కథ. వినడానికి పాత స్టోరీ యే అయినప్పటికీ కథను పూర్తి ఎంటైర్ టైన్ మెంట్ తో తెరకెక్కించాడట దర్శకుడు మల్లిఖార్జున్. అంచనాలు లేకుండా ఓ సాదాసీదా సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ తో వస్తే షేర్ తప్పక నచ్చుతుందని చెబుతున్నాడు హీరో కళ్యాణ్ రామ్. మరి పటాస్ తర్వాత అంచనాలతో వస్తున్న ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కి మరో బ్రేక్ ఇస్తుందా? అన్నది తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే. పూర్తి రివ్యూ కోసం నీహార్ ఆన్ లైన్ చూడండి.

furious
movie image view

రాజుగారి గది

బుల్లితెర ప్రేక్షకుల‌కు దగ్గరైన ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్‌ కామెడి చిత్రం ‘రాజుగారి గది’. జీనియస్ ఫ్లాప్ తర్వాత బుల్లితెర అన్నయ్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.బ్యానర్‌పై వారాహి చల‌నచిత్రం, ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్స్‌ సమర్పణలో పూర్ణ, అశ్విన్‌బాబు, చేతన్‌, ధన్యబాకృష్ణన్‌, విద్యుల్లేఖ, షకల‌క శంకర్‌, రాజీవ్‌కనకాల‌, పూర్ణ, ధనరాజ్‌ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. సూపర్ హిట్ ఫార్ములాగా నిలిచిన హర్రర్ కామెడీ నేపధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమా ‘రాజుగారి గది’.  పబ్లిసిటీ పుణ్యమా అని వారాహి చలన చిత్రం-ఏకే ఎంటర్టైన్మెంట్ వారు కలిసి ఈ సినిమాని రిలీజ్ చేసారు. భయపెడుతూనే కడుపుబ్బా నవ్విస్తానని నమ్మకంగా ఉన్న ఓంకార్ ఆశలని రాజుగారి గది ఎంతవరకూ నిజం చేసిందో తెలియాలంటే కొద్ది గంటలే ఆగాలి?

furious
movie image view

కంచె

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. అతని దర్శకత్వంలో, మెగా వారసుడిగా భారీ మాస్ ఇమేజ్ ఉన్నా, ముకుందా లాంటి ఓ క్లాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా కంచె. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన ప్రేమ కథ సన్నివేశాన్ని తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సర్కిల్స్‑లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరుణ్‑తో పాటు క్రిష్‑కు కూడా ఓ భారీ కమర్షియల్ సక్సెస్ అవసరమైన సమయంలో చేసిన కంచె, ఈ ఇద్దరికి ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో తెలియనుంది. ఈ చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 22 గురువారం విడుదల కానుంది.

furious
movie image view

బ్రూస్ లీ

శ్రీనువైట్ల-రాంచరణ్ కాంబినేషన్ లో రెడీ అయిన మొదటి సినిమా ఇది. ఇందులో రాంచరణ్ ఫైట్ మాస్టర్ క్యారెక్టర్ లో చేశాడు. ఇది ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ యాక్షన్, కామెడీ మూవీ. రాంచరణ్ బ్రూస్ లీకి అభిమానిగా ఇందులో కనిపిస్తాడు అందుకే అతని చేతిమీద బ్రూస్ లీ టాటూ కనిపిస్తుంది. మరొక విశేషం చిరంజీవి ఎనిమిదేళ్ళ తరువాత ఈ సినిమాలో ఓ గెస్ట్ పాత్రలో కనిపిస్తాడు. సినిమా ముగింపు దశకు చేరుకున్న సమయంలో చిరంజీవి షూటింగ్ పార్ట్ ను ఫినిష్ చేశాడు. తండ్రీ తనయులిద్దరూ కలిసి మొదటి సీన్ లో గుర్రాల మీద స్వారీ చేస్తూ కనిపిస్తారట. ఇది ఆడియన్స్ ను బాగా ఎట్రాక్టివ్ చేసే సీన్ అవుతుంది.