ఫ్రైడే రిలీజెస్

furious
movie image view

నాన్నకు ప్రేమతో...

మాస్ హీరో ఎన్టీఆర్, క్లాస్ మేకింగ్ డైరక్టర్ సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్ అంటేనే క్రేజ్. దానికి తోడు ఎన్టీఅర్ లుక్ నుంచి, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ దాకా విభిన్నత చూపిస్తూ వస్తున్నారు. దాంతో ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడిపోయింది. సినిమా లవర్స్ కు అయితే ఇక చెప్పక్కర్లేదు..ఎలాగైనా సినిమా చూడాలని ఫిక్సైపోయారు. అంతేనా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యి సినిమాని ఎట్టి పరిస్ధితుల్లో మిస్ కాకూడదనే వాతావరణం క్రియేట్ చేసాయి. మరి ఇలా అంచనాలు పెంచేసిన ఈ చిత్రం ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది గంటలు ఓపిక పట్టాల్సిందే. సినిమాపై విశ్లేషణ కోసం నీహార్ ఆన్ లైన్ చూడండి...

furious
movie image view

బెంగాల్ టైగర్

మాస్ రాజా మరోసారి తన రెగ్యులర్ ఫార్ములా ఎంటర్ టైన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బెంగాల్ టైగర్. పవన్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు ఇక కెరీర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అంటూ దర్శకుడు సంపత్ నందిని ఆకాశానికెత్తేశారు. అయితే ఆ అవకాశం తప్పిపోవటంతోపాటు కెరీర్ డైలామాలో ఉన్న సమయంలో పిలిచి మరీ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు రవితేజ. ఇక కిక్ 2 అనే ఒక్క సినిమాతో మాస్ మహరాజా మార్కెట్ గల్లంతయిపోయింది. దీంతో వీరిద్దరు ఎలాగైనా హిట్ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు.

ఇక రవితేజ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, బబ్లీ గర్ల్ రాశిఖన్నా జోడీ కట్టారు. పాటల్లో వీరి అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉందో ఇది వరకే రిలీజైన ట్రైలర్ లో మనం చూశాం. రాశిఖన్నా అయితే ఓ మెట్టు పైఎక్కి బికినీ వేసిందని సమాచారం. సో... గ్లామర్ పరంగా ఏ లోటు లేదని తెలుస్తోంది. ఇక కామెడీ పరంగా అమలాపాల్ గా బ్రహ్మీ, ప్యూఛర్ స్టార్ సిద్ధప్పగా థర్టీ ఇయర్స్ పృథ్వీ, సెలబ్రిటీ శాస్త్రిగా పోసాని తదితరులు ఉన్నారు. పక్కా యాక్షన్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ గురువారం (డిసెంబర్ 10న) ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రవితేజతోపాటు రాశిఖన్నా, ముఖ్యంగా సంపత్ నంది కెరీర్ కు కీలకమైన ఈ చిత్రం ఏ మేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.     

furious
movie image view

శంకరాభరణం

యంగ్ హీరోలలో ఎవరూ చేయని విధంగా స్వామిరారా నుంచి వైవిధ్యభరితమైన సబ్జెక్టుతో హ్యాట్రిక్ హిట్లు అందుకుంటున్నాడు నిఖిల్. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య ఇలా మూడు చిత్రమైన కథలే. దీంతో మరోసారి ఢిపరెంట్ కథతో శంకరాభరణంతో ముందుకు వస్తున్నాడు. కోనవెంకట్ సమర్పణలో ఎంవివి బ్యానర్ పై ఉదయ్ నందనవనమ్ అనే కొత్త కుర్రాడు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

బీహార్ బ్యాగ్రౌండ్ లో కిడ్నాప్ మాఫియా కథాంశంగా రాబోతుందీ చిత్రం. కామెడీ ఫ్లస్ యాక్షన్ కలబోతగా ఉన్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. లక్కీ బ్యూటీ నందితా రాజ్ నిఖిల్ కి జోడీగా నటిస్తోంది. అంజలి బందిపోటు రాణిగా ఓ కీలకపాత్రలో అలరించనుంది. ఈ చిత్రం ఈ శుక్రవారం (డిసెంబర్ 4న) విడుదలకానుంది. మరి నిఖిల్ హ్యాట్రిక్ ను కంటిన్యూ చేస్తూ ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందా... రివ్యూ కోసం ఒకరోజు ఆగాల్సిందే.  

furious
movie image view

సైజ్ జీరో

భారీ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన మరో భారీ చిత్రం ‘సైజ్ జీరో'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో విలక్షణమైన నటి అనుష్క నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఒకేసారి తమిళ్, తెలుగు బాషలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమిళ యువహీరో ఆర్య హీరోగా, సోనాల్ చౌహాన్, ఊర్వశి, గొల్లపూడి మారుతి రావు, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రం నవంబర్ 27న అంటే ఈ శుక్రవారం మన ముందుకు రానుంది.

ఒబెసిటీ తో బాధపడే అమ్మాయి పెళ్లికి సంబంధించి అనే ఓ విన్నూతమైన సబ్జెక్ట్ కి, కామెడీ జోడించి పక్కా కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ప్రకాశ్. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి అందించిన ఆడియో ఇప్పటికే మంచి స్పందన రాబట్టింది. ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించటంతో యూనిట్ హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క కష్టం తెరమీద చూడాలంటే ఇంకోక రోజు ఆగాల్సిందే. రివ్యూ కోసం నీహార్ ఆన్ లైన్ చూస్తూ ఉండండి.

furious
movie image view

కుమారి 21ఎఫ్

దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథా కథనాలు అందిస్తూ తెరకెక్కించిన సినిమా కుమారి 21 ఎఫ్. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ లాంటి వరుస సూపర్ హిట్స్తో మంచి ఫాంలో ఉన్న రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రిలీజ్కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫితో చిన్న సినిమానే అయినా, భారీ తనాన్ని సొంతం చేసుకుంది. ప్రచార ఆర్భాటాలు లేకపోయినా ప్రేక్షకులలో అంచనాలు పెంచేసిన కుమారి 21 ఎఫ్ సినీ అభిమానులను ఎంత వరకు మెప్పించిందో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే...

furious
movie image view

చీకటి రాజ్యం

కమల్ హాసన్ ఈ పేరు వింటేనే వైవిధ్యభరితమైన సినిమాలు గుర్తుకొస్తాయి. వయసు పై బడుతున్న ప్రయోగాత్మక చిత్రాలతో ఎప్పటికప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారాయన. అయితే తెలుగులో ఆయన నేరుగా చిత్రాలు చేసి చాలా రోజులైంది. ఆ మధ్య ఈనాడు చిత్రం తర్వాత వచ్చిన ఆయన ఇప్పుడు తిరిగి చీకటి రాజ్యంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

కమల్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన రాజేశ్ ఎం సెల్వ దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ్ లో తుంగవనంగా దీపావళికి వచ్చిన ఆ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక తెలుగులో ఓ పదిరోజులు ఆలస్యంగా ఈ శుక్రవారం (20-11-2015) ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్ అండర్ కవర్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్. ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్, కిషోర్, మధుషాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కరోజు రాత్రి జరిగే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు సమాచారం. డ్రగ్స్ మాఫియా నేపథ్యం ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కిందట. చూద్దాం. మరీ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో...