ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 350 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీనికి సంబంధించిన దస్త్రం సీఎం పేచీకి చేరిందని, అనుమతి లభించగానే త్వరలో నోటిఫికేషన్ ఉంటుందని అన్నారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రక్షాళన చేపట్టినట్లు చెప్పారు. 108 అంబులెన్స్ సర్వీసుల విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, దీనిపై సీఎంతో సమీక్షించి నిర్ణయం వెలువరిస్తామని మంత్రి చెప్పారు.