దేశ ప్రజల కోసం పాటుపడిన జాతి పిత మహాత్మా గాంధీ లాగానే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుపడిన ఎన్టీఆర్ కూడా జాతీయ నేతనే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ కు కేంద్రం ఎన్టీఆర్ పేరును పెట్టడంపై అన్నిపక్షాల పార్టీలు ఒకదానిపై మరోకటి విమర్శ ప్రతివిమర్శలతో దుమ్మేత్తి పోసుకుంటున్నాయి. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కేంద్రం చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా దీనిపై అసెంబ్లీలో తీర్మానమే చేపట్టింది. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యకు నిరసన తెలుపుతు టీటీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు చేస్తున్న ఒక్కరోజు దీక్షకు ఏపీ సీఎం చంద్రబాబు మద్దుతు తెలిపారు. దీక్షా శిబిరానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా యావత్ తెలుగు ప్రజలను అవమానించిందని అన్నారు. ఎన్టీఆర్ ఒక ప్రాంతానికో.. లేదా ఒక్క రాష్ర్టానికో చెందిన నేత కాదని, మహత్మా గాంధీ లాగానే ఎన్టీఆర్ కూడా జాతీయ నేతే అని చెప్పుకొచ్చారు. అలాంటి మహానుభావుడి పేరుని ఎయిర్ పోర్ట్ కు పెట్టడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఇక అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యను అవమానించిన సంగతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందుకే కదా తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీపెట్టి గెలిచిందని, అలాంటి గొప్ప వ్యక్తిపై ఇలా విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ప్రభుత్వానికి చంద్రబాబు సూచించారు.