ఏదైనా తప్పు జరిగితే పోలీస్ స్టేషన్ కు వెళ్తాం. కానీ పోలీస్ స్టేషన్ నే తప్పు చేస్తే ఏం చేయాలి. సరిగ్గా ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది. తప్పు చేసిన పోలీస్ స్టేషన్ ను జప్తు చేసిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. విషయం ఏంటంటే పాల ఫ్యాక్టరీ వద్ద నున్న రైల్వే పోలీస్ స్టేషన్ బిల్డింగ్ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉంది. ఏళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో అది కొండంతైకూర్చుంది. దాదాపు కోటి రూపాయలు కావటంతో లాభం లేదనుకుని నోటీసులు పంపింది. ఇలా ఎన్నిసార్లు నోటీసులు పంపినా ఫలితం లేకపోవడంతో ముందుకు కదిలిన నగరపాల సంస్థ అధికారులు చివరకు దానిని జప్తు చేశారు. బకాయిలను చెల్లించి క్లియరెన్స్ పొందాలని మున్సిపల్ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.