సామాజిక న్యాయాన్ని వదలావా నాయనా!

December 08, 2014 | 10:39 AM | 41 Views
ప్రింట్ కామెంట్

ఏ క్షణంలో ఐతే ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో కానీ, మన మెగాస్టార్ చిరంజీవి సామాజిక న్యాయం అనే పదాన్ని వదలటం లేదు. పార్టీ ని కాంగ్రెస్ లో కలిపి దాదాపు నాలుగేళ్లు కావస్తున్నప్పటికీ ఆయనకింకా సామాజిక న్యాయంపై మక్కవ పోనట్లుంది. తెలంగాణ ఏర్పాటు విషయంలో కూడా అభిప్రాయం కోరినప్పుడు కూడా సారూ... సామాజిక న్యాయాన్నే పరిగణలోకి తీసుకొవాలని కొరారంటే ఎంత ఎక్కేసిందో అర్థం చేసుకొవచ్చు. ఇక ఇప్పుడు మళ్లీ అదే పాట అందుకున్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితోసహా హాజరైన ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ లో అసలు ప్రజారాజ్యాన్ని ఎందుకు కలిపారో వివరణ ఇచ్చారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని భావించిన ఆయన పార్టీని కలిపేశారట. ఇది వింటూంటే మీకేం అనిపిస్తుంది. ఇన్నీ సార్లు ఆ పదాన్ని ఉచ్ఛరించే ఆయన దానికి అర్థం చెప్పమంటే మాత్రం తటపటాయిస్తుంటారు. ఇక జనాలేమో ఆ పదాన్ని వదలవా నాయనా అని చిరును ప్రశిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ