సిరంజీవి సవాల్: మరోకరికి గుచ్చాడండోయ్

August 28, 2015 | 01:01 PM | 5 Views
ప్రింట్ కామెంట్
group_pscho_syringe_in_westgodavari_niharonline.jpg

ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. ఏ ఊరికొస్తాడో అస్సలు తెలియదు. కానీ రెప్పపాటులో వచ్చేస్తాడు. చుక్కపోటులా సూది గుచ్చిపోతాడు. పట్టుకుందామంటే చిక్కడు. పని పడదామంటే ఆనవాలు కూడా దొరకవు. ఇదీ పశ్చిమగోదావరి జిల్లాలో  ప్రస్తుతం నెలకొన్న సూదిగాడి కథ. ఇది ఒక్కడి పనేనా... లేక  ముఠా పనా అన్నది అర్థం కాక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ సూది గాడు రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే జిల్లాలో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నాలుగు రోజుల్లో 8మందిని గాయపరిస్తే.. బుధవారం ఒక్కరోజే ఐదుగురిపై సిరంజీతో దాడి చేశారు.

                       సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కదిలించాడంటే ఈ సూదిగాడు ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కదిలిన పోలీస్ యంత్రాగం అతన్ని పట్టుకునేందుకు 200 బృందాలను నియమించింది. అయితే పోలీసులు స్పందించిన 24 గంటల్లోపే మరో సూది పడింది. శుక్రవారం ఉదయం నర్సాపురం రోడ్డులో ఓ పదేళ్ల బాలికకు ఇంజక్షన్ గుచ్చి పారిపోయాడు. దీంతో సైకో బారినపడిన వారిసంఖ్య 12 కి చేరింది. బాధితులు చెప్పిన వివరాలతో ఊహచిత్రాన్ని రాబట్టుకున్న పోలీసులు అతగాడిని పట్టుకునే ప్రయత్నంలో బిజీ అయిపోయారు. అగంతకుల కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నట్లు ఆ సిరంజీవి ని పట్టిస్తే లక్ష రూపాయల నజరానాను పోలీస్ శాఖ ప్రకటించిందండోయ్

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ