పొద్దుటూరులో పట్టుబడ్డ పైరసీ రక్కసి

January 16, 2015 | 03:40 PM | 25 Views
ప్రింట్ కామెంట్

ఎన్ని చర్యలు తీసుకుంటున్న పైరసీ భూతానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల విడుదలైన పవన్, వెంకీ ల గోపాల గోపాల, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ లాంటి కొత్త చిత్రాలకు చెందిన వేలకొద్దీ పైరసీ సీడీలు కడప జిల్లా ప్రొద్దుటూరులో లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో పైరసీ సీడీలు పెద్దఎత్తున విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు జరిపి వివిధ సినిమాలకు చెందిన మూడు వేలకు పైగా సీడీలను స్వాధీనం చేసుకున్నారు. గోపాల గోపాల, ఐ, చిన్నదాన నీకోసం, రఘువరన్ బీటెక్, లక్ష్మీ రావే మా ఇంటికి, తదితర సినిమాల పైరసీ సీడీలు దాడిలో లభ్యమయినట్లు సమాచారం. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు. విడుదలై నాలుగైదు రోజులు కాకముందే ఈ సంఖ్యలో పైరసీ సీడీలు పట్టుబడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనివెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ