సినిమా సమీక్ష

furious
movie image view

షేర్

వరుస ప్లాఫుల సమయంలో అనిల్ రావిపూడి రూపంలో  ‘పటాస్’ అంటూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. గత సినిమాలకు చేసిన పొరపాట్లను పటాస్ తో తీర్చేసుకున్నానని, ఇకపై జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటానని చెప్పాడు కూడా. ఇక పటాస్ తోపాటే షూటింగ్ ప్రారంభించుకున్న షేర్ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కిన షేర్ కి గతంలో కళ్యాణ్ రామ్ తో అభిమన్యు, కత్తి సినిమాలను తీసిన మల్లికార్జున్ దర్శకుడు. అవి రెండు అంతగా ఆడకపోయినా మల్లిఖార్జున్ పై నమ్మకంతో ముచ్చటగా మూడో ఛాన్స్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. మరి ఈ చిత్రం వీరిద్దరికి ఎలాంటి ఫలితమిచ్చింది. పటాస్ తర్వాత షేర్ తో కళ్యాణ్ రామ్ మరో హిట్ అందుకున్నాడా? లేక హ్యాట్రిక్ ఫెయిల్ చవిచూశాడా రివ్యూ లోకి వెళ్లి చూద్ధాం...

furious
movie image view

రాజుగారి గది

ఈ మధ్య కాలంలో  సూపర్ హిట్ ఫార్ములాగా నిలిచిన హర్రర్ కామెడీ నేపధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమా ‘రాజుగారి గది’. జీనియస్ ఫ్లాప్ తర్వాత బుల్లితెర అన్నయ్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. పబ్లిసిటీ పుణ్యమా అని వారాహి చలన చిత్రం-ఏకే ఎంటర్టైన్మెంట్ వారు కలిసి ఈ సినిమాని రిలీజ్ చేసారు. భయపెడుతూనే కడుపుబ్బా నవ్విస్తానని నమ్మకంగా ఉన్న ఓంకార్ ఆశలని రాజుగారి గది ఎంతవరకూ నిజం చేసింది.? ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలోకి వెళ్దాం...

furious
movie image view

కంచె

డిఫరెంట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రిష్ దర్శకత్వంలో వచ్చిన మరో సరికొత్త మూవీ ‘కంచె’. తెలుగు తెరపై ఇదివరకూ మునుపెన్నడూ రాని, చూడని వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమానే ఈ కంచె. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా, ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా, బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 1930 నాటి ప్రేమకథకి వరల్డ్ వార్ II ని ఎంతవరకూ మిక్స్ చేసి, ఎంత ఎంగేజింగ్ గా ఈ సినిమాని చెప్పాడు అన్నది ఇప్పుడు చూద్దాం.

furious
movie image view

బ్రూస్ లీ - ది ఫైటర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ శీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రూస్ లీ-ది ఫైటర్. అయితే వీరిద్దరి చిత్రం అనే కన్నా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ పైనే ఈ సినిమా గురించి హైప్ అంతా నెలకొంది. మగధీర లో ఓ చిన్న బిట్ లో మెరిసిన చిరు దాదాపు 6 ఏళ్ళ తర్వాత స్క్రీన్ పై అది కూడా తనయుడి చిత్రంలో మరో సారి అతిధి పాత్రలో కనిపించనున్నాడు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో... చిరు స్క్రీన్ పై ఎలా మెరిశాడో... వివరాలు తెలియాలంటే... చలో రివ్యూ...

furious
movie image view

రుద్రమదేవి

ఓ తల్లి బిడ్డను కనే సమయంలో పురిటి నొప్పులు ఎలా పడుతుందో అంతకన్నా ఎక్కువ బాధను అనుభవించాను ఈ సినిమా విడుదల కోసం అని చెప్పుకొచ్చాడు దర్శకుడు గుణశేఖర్. ఆర్థిక సమస్యలు, చిత్ర పెద్దల సహకారం లేకపోవటం తదితర కారణాల వల్ల చాలా ఆలస్యంగా విడులైంది రుద్రమదేవి. ఇండియన్ ఫస్ట్ 3డి హిస్టారికల్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిందా చిత్రం. తన ఆస్తులన్నీంటిని అమ్ముకుని మరీ ఈ చిత్రాన్ని నిర్మించాడు గుణ. ఇక తెలుగులో లేడీ ఓరియెంటల్ చిత్రాలకు మళ్లీ ఆద్యం పోసిన నటి అనుష్క ఇందులో లీడ్ రోల్ రుద్రమగా నటించింది. ఆమె కూడా ఓవైపు బాహుబలితోపాటు రెండేళ్లు ఈ చిత్రం కోసం సమయం కేటాయించింది. అల్లు అర్జున్, రానా లాంటి స్టార్లతోపాటు భారీ తారాగణంతో వచ్చిన  ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? గుణశేఖర్ 12 ఏళ్ల శ్రమకి స్పందన ఏంటి? రివ్యూలోకి వెళ్దాం...     

furious
movie image view

శివమ్

చిన్నవయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చి కొద్దీ కాలంలోనే హీరోగా ఎదిగాడు. కామెడీతోపాటు మాస్ అంశాలకు పెద్దపీట వేస్తూ స్టార్ గా ఎదిగాడు. అయితే కొన్నేళ్లుగా హిట్ లేదు. వరుసపెట్టి సినిమాలు చెయ్యటం, అవి మూస ఫార్ములాలో ఉండటంతో ప్రేక్షకులు తిరస్కరించడం అలవాటైపోయింది. చివరికి పండగచేస్కో అంటూ కామెడీ జోనర్ తో వచ్చినా అది వర్కవుట్ కాలేదు. దీంతో కాస్త ఛేంజ్ చేసి మాస్ ఫార్ములాతో వచ్చాడు. అదే శివమ్. నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డిని పరిచయం చేసిన ఈ సినిమాలో రామ్ కి జోడీగా రాశీ ఖన్నా నటించింది. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ట్రైలర్ లో మాత్రం రెగ్యూలర్ ఫార్మాట్ లాగే అనిపించినా... ఎంటర్ టైన్ మెంట్ కి కొదవ ఉండదని హీరో రామ్ చెబుతూ వస్తున్నాడు. మరీ చిత్రం ప్రేక్షకులను అలరించిందో లేదో తెలియాలంటే... చలో టూ రివ్యూ …