విభిన్న సినిమాలు తీసే ఓ దర్శకుడు, వైవిధ్యభరితమైన పాత్రలు చేసే ఓ హీరో... కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. 24 లా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైం ట్రావెలింగ్ అన్న కథాంశం చాలా సినిమాల్లో వచ్చినప్పటికీ దానిని విక్రమ్ కుమార్ హ్యాండిల్ చేస్తున్నాడు అంటేనే దానికో ప్రత్యేకత ఏర్పడింది. స్వయంగా సూర్య ప్రొడ్యూస్ చేసిన 24 చిత్రం ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్ర ఫలితం ఏంటో రివ్యూలోకి వెళ్లాక డిసైడ్ చేద్దాం.
మాస్ సినిమాల స్థాయిని పీక్స్ లోకి తీసుకెళ్లిన దర్శకుడు బోయపాటి శీను. హీరోయిజం ఫ్లస్ డైలాగ్ డెలివరీలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే పవర్ ఫుల్ చిత్రాలను అందించాడు. ఇక ఫుల్ ఎంటర్ టైనర్ అండ్ ఎనర్జిటిక్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే సరైనోడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాల మధ్య అదే స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అంచనాలు అందుకుందా చూద్దాం.
దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో హీరోగా వచ్చిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. పదేళ్ల తర్వాత పవన్ కి హిట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ చిత్ర ప్రేరణతో స్వయంగా పవన్ కళ్యాణ్ రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అందించగా, పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహించాడు. ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం ఫలితం ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
తెలుగులో ఇప్పుడున్న జనరేషన్ లో ఏ హీరో కూడా లేనంత బిజీగా ఉన్నాడు నారా రోహిత్. రెండు వారాల గ్యాప్ లో మరో చిత్రంతో మన ముందుకు వచ్చేశాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో పరిచయమై మెప్పించిన దర్శకుడు పవన్ సాదినేనిల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..
ప్రయోగాత్మక చిత్రాలతో హ్యాట్రిక్ పూర్తిచేసుకుని ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో మన ముందుకు వచ్చాడు అక్కినేని నాగార్జున. తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ ఊపిరి. ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచ్ బుల్స్ ను ఆధారంగా చేసుకుని మన నేటివిటికీ తగ్గట్లు రూపొందించాడు దర్శకుడు వంశీపైడిపల్లి. ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైంది. మరి దీని ఫలితం ఏమైందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.