సినిమా సమీక్ష

furious
movie image view

శంకరాభరణం

ప్రస్తుతం ఉన్న నటుల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించటం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఢిపరెంట్ కథలతో వచ్చి మరీ ఆ ఫీట్ ను సొంతం చేసుకున్నాడు యువనటుడు నిఖిల్. ప్రత్యేకమైన జోనర్ ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకుంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక పాత కథలనే రిపీట్ చేస్తున్నాడంటూ కోన వెంకట్ సినిమాలను ప్రేక్షకులు సున్నితంగా తిప్పి కొడుతున్నారు. అలాంటి టైంలో వీరిద్దరి కలయికలో ఓ సినిమా రావటంతో కాస్త అంచనాలు పెరిగాయి. క్రైం కామెడీ థ్రిల్లర్ అంటూ శంకరాభరణం పేరుతో ఓ సినిమా రూపొందించారు. క్లాసిక్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకు ఉదయనందనవనమ్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించాడు. మరీ ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫలితం ఎలా ఉందో రివ్యూ లోకి వెళ్లి చూద్దాం.

furious
movie image view

సైజ్ జీరో

ఈ సంవత్సరం బాహుబలి, రుద్రమదేవి అనే రెండు పీరియడ్ ఫిల్మ్స్  ప్రేక్షకులను అలరించింది లేడీ సూపర్ స్టార్ అనుష్క. ఇక కాస్త డిఫరెంట్ గా ఆలోచించి భారీగా బరువు పెరిగి తీసిన చిత్రం సైజ్ జీరో. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పీవీపీ వంటి భారీ నిర్మాత సంస్థ నుంచి రాబోతుంది. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్షన్ లో ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో చేసిన ఈ సినిమా ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్ర సంగతేంటో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

furious
movie image view

కుమారి 21ఎఫ్

ప్రేమకథలను విభిన్న పంథాలో అందించే సక్సెస్ ఫుల్ దర్శకుడు సుకుమార్.  తన కలం నుంచి కొత్త కథలను అందించాలని సుకుమార్ రైటింగ్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించాడు. అలా తన కథ,  స్క్రీన్ ప్లేని అందించి చేసిన మొదటి చిత్రమే ‘కుమారి 21F’.  ప్రేమ విషయంలో నేటి యూత్ ధోరణి ఎలా ఉంది అన్న దానికి మసాలాను యాడ్ చేసి ఓన్లీ యూత్ ని టార్గెట్ చేస్తూ చిత్రాన్ని తెరకెక్కించాడు సుకుమార్ అసిస్టెంట్ పల్నాటి సూర్య ప్రతాప్. కంప్లీట్ అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హీబా పటేల్ (నూతన పరిచయం) జంటగా నటించారు. మరి ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం...

furious
movie image view

చీకటి రాజ్యం

లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’. ఫ్రెంచ్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్, మధు శాలిని, సంపత్ లు ముఖ్య పాత్రలు పోషించారు. డ్రగ్ మాఫియా నేపధ్యంలో సాగే ఈ సరికొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్ కి రాజేష్ ఎం సెల్వ డైరెక్టర్. తమిళంలో ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలయ్యింది. తెలుగు ప్రేక్షకులకి బాగా తక్కువ పరిచయం ఉన్న ఈ జానర్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం...

furious
movie image view

అఖిల్-ది పవర్ ఆఫ్ జువా

ఇండస్ట్రీలో ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారిన పేరు అఖిల్.  అభిమానులతో పాటు, సినీ వర్గాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ అక్కినేని వారసుడి కోసం. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ ని లాంచ్ చేస్తూ చేసిన ఈ సినిమాని మరో నటుడు నితిన్ నిర్మించాడు. ఇక దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఫలితం ఏమిటి?

furious
movie image view

త్రిపుర

తెలుగు ప్రేక్షకులు హర్రర్ జోనర్ లో వచ్చే చిత్రాలను భాషాబేధం లేకుండా ఎప్పటికప్పుడు ఆదరిస్తూ వస్తారు. దర్శకుడు రాజ్ కిరణ్ మొదటి చిత్రం గీతాంజలి కూడా ఇదే కోవలోకి వస్తుంది. దాని సూపర్ హిట్ చేసేశారు. ఇక అదే ఊపుతో త్రిపుర అంటూ మరో హర్రర్ చిత్రంతో మన ముందుకు వచ్చేశాడు. బబ్లీ గర్ల్ స్వాతి ఇందులో లీడ్ రోల్ చేసింది. మరి గీతాంజలికి పట్టం కట్టినట్టే దీనిని ఆదరించారా? లేక తిరస్కరించారా? రివ్యూలోకి వెళ్లి చూద్దాం.