సినిమా సమీక్ష

furious
movie image view

కిల్లింగ్ వీరప్పన్

వివాదాస్పద దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరోసారి రియల్ లైఫ్ స్టొరీ తో చేసిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గజగజా వణికించిన స్మగ్లర్ వీరప్పన్ కథ ఏంటి, అతనిని ఎలా చంపారు అనే పాయింట్ మీద ఈ సినిమాని తీసారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా, సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రలో కనిపించారు. మరి రక్తచరిత్రలాగా ఈ రియల్ స్టోరీ కూడా ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలోకి వెళ్దాం...

furious
movie image view

నేను... శైలజ

ఒకే టైప్ ఆప్ సినిమాలు చేసుకుంటూ పోవటంతో రామ్ సినిమాలంటే జనాలకి విరక్తి వచ్చేసింది. పండగచేస్కో, శివమ్ అంటూ గతేడాది బోరింగ్ సినిమాలతో చుక్కలు చూపాడు రామ్. తన బాడీలాంగ్వేజ్ కి ఏ మాత్రం సంబంధం లేని క్యారెక్టర్లతో వరుసగా విసిగించేస్తూ వస్తున్నాడు. క్రమంగా రామ్‌ జడ్జిమెంట్‌పై జనాలకి నమ్మకం సడలింది. అయితే నేను శైలజ తొలి టీజర్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచి ఒక విధమైన పాజిటివ్‌ బజ్‌ స్టార్ట్‌ అయింది. గతంలో తాను అలాంటి చిత్రాలు చేసిన చాలా తప్పు చేశానని, ఈసారి ఫీల్ గుడ్ మూవీని అందిస్తానని చెప్పటంతో కాస్త నమ్మకంతో థియేటర్లకు వెళ్లారు. మరీ థియేటర్ల వరకు జనాన్ని ఆకర్షించిన శైలజకి రెండున్నర గంటల పాటు ఆకట్టుకునే శక్తి వుందా? రివ్యూలోకి వెళ్దాం...

furious
movie image view

భలే మంచి రోజు

మహేష్ బావగా ఇండస్ట్రీకి పరిచయమై ఒక్క సినిమా తప్ప (ప్రేమకథా చిత్రమ్) అసలు సక్సెస్ లేకుండా పోయాడు హీరో సుధీర్ బాబు. ఈ యేడు రెండు చిత్రాలు వచ్చినప్పటికీ వచ్చినవి వచ్చినట్లు పోయాయి. ఇక ఇప్పుడు చివర్లో భలే మంచి రోజుగా వచ్చాడు. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కలిసి ప్రయోగాత్మకంగా కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కించాడు. ట్రైలర్ ఢిపరెంట్ గా తోచటంతో చిత్రంపై ఆశలు బాగానే పెంచాయి. వామికా హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాయికుమార్ లాంటి కీలకనటులు ఉన్నారు. మరీ ఇంతకు ముందు వచ్చిన కిడ్నాప్ డ్రామాల్లాగా ఇది బోర్ కొట్టించిందా లేక ఆకట్టుకుందా చూద్దాం... సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ కు మంచి రోజును ఇచ్చిందా? రివ్యూలోకి వెళ్దాం...   

furious
movie image view

సౌఖ్యం

తన గత రెండు చిత్రాలతో(లౌక్యం, జిల్) డీసెంట్ హిట్స్ అందుకున్న హీరో గోపీచంద్ మరోసారి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సౌఖ్యం’తో మన ముందుకు వచ్చాడు. గోపికి ఫస్ట్ కమర్షియల్ హిట్ యజ్ఞం అందించిన కెఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ దీనికి దర్శకుడు. డస్కీ బ్యూటీ రెజీన హీరోయిన్ గా, కామెడీని హైలైట్ చేస్తూ కంప్లీట్ ఫ్యామిలీ ఎంరట్ టైనర్ గా ఇది తెరకెక్కినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. క్రిస్మస్ కి ఒకరోజు ముందుగా (డిసెంబర్ 24న) గురువారం ఈ చిత్రం విడుదలైంది. మరీ సౌఖ్యం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం...

furious
movie image view

లోఫర్

హీరోలను పక్కా మాస్ క్యారెక్టర్ లలో ఇడియట్లుగా, పోకిరీలుగా, దేశముదురులుగా చూపించాడు పూరీ జగన్నాథ్. హీరోకి పక్కా మాస్ ఇమేజ్ రావాలంటే ఖచ్ఛితంగా పూరీ చేతిలో పడాలని ప్రభాస్ లోఫర్ ఆడియో పంక్షన్ లో చెప్పుకోచ్చాడు. ముకుంద, కంచెలో క్లాస్ పాత్రల్లో మెప్పించిన వరుణ్ తేజ్ ను లోఫర్ గా తీసుకోచ్చాడు పూరీ. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడు. దిశా పఠానీ అనే కొత్త ముఖాన్ని పరిచయం చేస్తూ వరుణ్ ని లోఫర్ గా ఎలా చూపించాడో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం...

furious
movie image view

బెంగాల్ టైగర్

పవర్ స్టార్ తో ఛాన్స్ మిస్సయ్యాడు ఇంక ఇతనితో సినిమాలు ఎవరు తీస్తారంటూ అనుకుంటున్న సమయంలో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు మాస్ రాజా. పవన్ కళ్యాణ్ తో తీద్దామనకున్న చిత్రానికి అనుకున్న టైటిల్ నే రవితేజ చిత్రానికి పెట్టేసి కథను మాత్రం పూర్తిగా మార్చానని చెప్పుకోచ్చాడు సంపత్ నంది. సినిమాలో కొత్తదనం ఏం ఆశించొద్దు అంటూ ముందే హింట్ ఇచ్చేశాడు. ఇక కిక్ 2 డిజాస్టర్ మార్కెట్ కోల్పోయి ఢీలా పడ్డ రవితేజకు ఈ చిత్రం కీలకం. మరి భారీ అంచనాలతో ఈరోజు(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర ఫలితం ఎలా ఉందో తెలుసుకోవాలంటే చలో రివ్యూ...