సినిమా సమీక్ష

furious
movie image view

పులి

ఇళయదళపతి విజయ్ కి తమిళనాట ఉన్న మాస్ క్రేజ్ తెలిసిందే. రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను మెయింటెన్ ను చేస్తున్న ఏకైక నటుడు విజయే. అలాంటి విజయ్ ఫస్ట్ టైం సోషియో ఫాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోస్ట్ వెయిటింగ్ మూవీగా తెరకెక్కింది పులి. ఇక చాలా కాలం తర్వాత అతిలోకసుందరి శ్రీదేవీ నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో, కన్నడ స్టార్ నటుడు సుదీప్ విలన్ పాత్రలో నటించడం పులి ప్రత్యేకతలు. అందాల నటీమణులు శృతీహాసన్, హన్సికలు విజయ్ కి జోడిగా నటించారు. భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ చాలా ఇబ్బందుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ తుపాకీ లాగానే ఈ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులను అలరించిందా? రివ్యూలోకి వెళ్దాం...

furious
movie image view

సుబ్రమణ్యం ఫర్ సేల్

యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం రేయ్ అయినప్పటికీ విడుదలైంది మాత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’. ఆ సినిమాతో మొదటి చిత్రమే హిట్ అయ్యింది. రేయ్ ఫలితాన్ని పక్కనబెడితే ఇప్పుడు మూడో చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో ఈ గురువారం (సెప్టెంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి హిట్ లో భాగస్వామి అయిన హీరోయిన్ రెజీనా నే ఇందులోనూ నాయికగా నటించింది. గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ దిల్ రాజు నిర్మాత. మరి ఇన్ని హంగులతో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఏం రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం...

furious
movie image view

కేటుగాడు

ప్రకాశ్ రాజ్ ఉలవచారు బిర్యానితో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తేజస్ హీరో, షార్ట్ ఫిల్మ్స్ తో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన నటి చాందిని చౌదరి. వీరిద్దరు జంటగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కేటుగాడు’. వెంకటేష్ మూవీస్ పతాకంపై వెంకటేష్ బాలసాని ఈ సినిమాను నిర్మించారు. ఓ కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇది ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం...

furious
movie image view

కొరియర్ బాయ్ కళ్యాణ్

ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి వరుస హిట్స్ తో ఫాంలోకి వచ్చిన నితిన్ ఆ తర్వాత హర్ట్ ఎటాక్, చిన్నదాన నీకోసం తో కాస్త తగ్గాడు. సినిమాలు సో సోగా ఆడినా అవి నితిన్ కి పెద్దగా పేరు తేలేకపోయాయి. అలాంటి నితిన్ తో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందింది. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ్ సాయి దీనిని తెరకెక్కించాడు. ప్రీమియమ్ రష్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది. అదే కొరియర్ బాయ్ కళ్యాణ్. కానీ, ఏమైందో తెలీదు కానీ చాలా కాలంగా రిలీజ్ కి నోచుకోలేదు. చివరికి అన్ని కుదిరి వినాయకచవితి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా ఏమేర ఆకట్టుకుందో  చూద్దాం..

furious
movie image view

మయూరి

కెరీర్ మొదటి ఇన్నింగ్స్ టాప్ హీరోలతో గ్లామర్ పాత్రలను చేసుకుంటూ వచ్చింది నయనతార. అయితే సెకండ్ ఇన్నింగ్స్ శ్రీరామరాజ్యం తర్వాత ఆమెలో చాలా మార్పు వచ్చింది. క్యారెక్టర్, కంటెంట్ ఉంటే చాలు చిన్న హీరోలతోనైనా నటించేందుకు సిద్ధమైపోతుంది. ఇదే క్రమంలో తమిళంలో షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కింది. అదే మయూరి. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హర్రర్ చిత్రంగా తెరకెక్కిన మయూరి వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య హర్రర్ చిత్రాలు చాలానే వచ్చేస్తున్నాయి. మరీ వీళ్లు కొత్తగా ఏం చూపించారు అన్న అనుమానం మీకు ఉందా. అయితే కథలోకి పదండి...

furious
movie image view

హోరాహోరీ

దర్శకుడు తేజ ప్రేమ కథలకు పెట్టింది పేరు. ఒకానొక టైంలో అగ్రదర్శకుడిగా కొనసాగాడు. ఆయన పేరు చెప్పగానే చిత్రం, జయం, నువ్వు-నేను, నిజం లాంటి హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. కానీ, దశాబ్దంగా తేజకి బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస పెట్టి ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. మూడేళ్ల క్రితం వచ్చిన నీకు నాకు డ్యాష్ డ్యాష్ కూడా అట్టర్ ప్లాప్ అయ్యంది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని మరో ప్రేమకథతో మన ముందుకు వచ్చాడు తేజ. అందరు కొత్తవాళ్లతో ‘హోరా హోరీ’ అనే చిత్రాన్ని తీసుకొచ్చాడు. ‘ఫైట్ ఫర్ లవ్’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. అలా మొదలైంది, అంతకు ముందు ఆ తరువాత లాంటి సినిమాలను అందించిన రంజిత్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీనికి తోడు ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. దీంతో ఈ సారి హిట్ ఖాయం అని తేజ కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. మరి ఆ అంచనాలను తేజ ఈసారైనా అందుకున్నాడా... రివ్యూలోకి వెళ్దాం...