ఐదు రోజుల క్రితం తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన 20 మంది ఎర్ర చందనం దొంగల ఎన్ కౌంటర్ ఉదంతాన్ని హత్యకేసుగా నమోదుచేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసును ఐపీసీ సెక్షన్ 302 (హత్యాకేసుగా) నమోదుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉదయం ఎన్ కౌంటర్ ఘటనపై ఏపీ పోలీసులు నివేదిక సమర్పించగా... ఎదురుకాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదుచేశారా? లేదా? అని కోర్టు తిరిగి ప్రశ్నించింది. కోర్టుకు ఇచ్చిన నివేదిక సరిగ్గా లేదని వ్యాఖ్యానిస్తూ పూర్తి వివరాలతో మరో నివేదిక అందించాలని డీజీపీని ఆదేశించిన సంగతి తెలిసిందే.