ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిది అభివృద్ధి విజన్ అయితే, ప్రతిపక్ష వైఎస్సార్సీపీది దోపిడీ విజన్ అని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అభివర్ణించారు. జగన్ దోపిడీకి పాల్పడ్డారు గనుకనే కేసులను ఎదుర్కొంటున్నారని, జైలు జీవితం కూడా గడిపారని సెటైర్ విసిరారు. ఆయన వల్ల పక్కనున్న వారు కూడా కేసుల్లో ఇరుకున్నారని విమర్శించారు. మళ్లీ ఎన్నటికైనా జగన్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. ప్రతిపక్షనేతగా ఆంద్రప్రదేశ్ అభి వృద్ధికి సహకరించాల్సిందిపోయి, తన పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. వైకపా గనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏమీ మిగలదనీ, సర్వం దోచేసుకుంటారని అన్నారు.