అక్టోబర్ 22... ఏపీలో రెండు పండగలు

September 29, 2015 | 12:36 PM | 2 Views
ప్రింట్ కామెంట్
amaravathi-inaugurate-day-AP-festival-day-niharonline

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ ప్రారంభం ఎప్పుడెప్పుడా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. సింగపూర్ నిపుణులతో ఈ ప్లాన్ ను రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. వేల కోట్ల వ్యయంతో రూపొందించిన కలల రాజధానిని నిజం చేసేందుకు ఎంతో సమయం పట్టదని ముఖ్యమంత్రి ధీమాతో ఉన్నారు. భూసేకరణతోపాటు పాలనా పరమైన చిక్కులతో ఇన్నాళ్ల సతమతమైన ప్రభుత్వానికి ఇన్నాళ్లకు ఊరట లభించింది.

వరుస పెట్టుబడులతోపాటు విదేశీ కంపెనీలు కూడా ముందుకు రావటం, కేంద్రం కేటాయింపులు అదనంగా చేరటంతో రాజధాని నిర్మాణానికి అడ్డంకులన్నీ వీడిపోయాయి. ఏడాదిన్నరగా వాయిదా పడుతున్న ముహుర్తం ఎట్టకేలకు కుదిరింది. అక్టోబర్ 22 విజయదశమి రోజున అమరావతికి శంకుస్థాపన చెయ్యాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తో సహా మూడు దేశాల ప్రధానులను ఆహ్వానించినట్లు అధికార వర్గం చెబుతోంది. దీంతో ఒకేరోజు రెండు పండగల సందడి వాతావరణం ఏపీలో నెలకొననుంది. ఇక అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసే ఆ రోజునే రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శంకుస్థాపన రోజు పండుగ అంటూ జీవో కూడా విడుదల చేసింది. దీంతో ఇకపై ప్రతీఏడూ రాష్ట్రపండగను నిర్వహించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించాడట. ఇక ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ముంబైకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు 9.50 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ