వాన్ పిక్, లేపాక్షి భూకేటాయింపులు రద్దు

November 20, 2014 | 04:07 PM | 32 Views
ప్రింట్ కామెంట్

వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ల భూకేటాయింపులకు సంబంధించిన లైసెన్స్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేసింది. అవినీతి నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ సెంటర్లకు వేలాది ఎకరాలను ధారాదత్తం చేశారు. నాలెడ్జ్ హబ్ ల ఏర్పాటు కోసం వేల ఎకరాల కొద్ది భూమిని తీసుకున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి పనులు చేపట్టన్నందున కేటాయించిన 18,895 ఎకరాలను తక్షణమే వెనక్కు తీసుకుంటున్నట్టు మంత్రి ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ