సొంత ఊరిపై అంతా ప్రేమేనా?

November 19, 2014 | 04:30 PM | 42 Views
ప్రింట్ కామెంట్

వెండితెరపై మెగాస్టార్ గా వెలిగిన చిరంజీవి రాజకీయాలలో ఎంత దారుణంగా విఫలమయ్యారో తెలిసిందే. కనీసం సొంత ఊరికి కనీసం ఏం చేయలేని చిరును ఎందుకు గెలిపించాలనుకున్నారో ఏమో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు ప్రజలు చిత్తుగా ఓడించారు. అయితే అదే ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడం, వారి కనికరంతో రాజ్యసభకు ఆపై ఏకంగా కేంద్రమంత్రి అయిపోవడం చకచకాగా జరిగాయి. అయితే ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయనకు ఓ మంచి ఆలోచనకే వచ్చినట్టు కనిపిస్తుంది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకంలో భాగంగా ఎంపీలంతా గ్రామాలను దత్తత తీసుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు చిరు స్పందించారు. తన స్వస్థలం మొగల్తూరు మండలంలోని పెరుపాలెం అనే గ్రామాన్ని చిరంజీవి దత్తత తీసుకోనున్నాడు . ఇకపై ఎంపీలాడ్స్ నిధులను గ్రామం ప్రాథమిక మౌలిక వసతుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడట. గతంలో రాజకీయాల్లోకి రాకముందే హీరోగా ఉన్న సమయంలోనే మొగల్తూరులోని తన పాత ఇంటిని గ్రామ గ్రంథాలయం కోసం విరాళంగా ఇస్తానని చిరు వాగ్ధానం చేశాడట. ఆపై ఆ విషయాన్నే మరిచిపోయి ఒక ప్రైవేట్ సంస్థకు భారీ మొత్తానికి ఆ ఇంటిని అమ్మేశాడట. దీంతో గ్రామస్తుల దృష్టిలో చిరు ఛీప్ అయిపోయాడని టాక్. ఇక పాలకొల్లు ప్రజలైతే ఏకంగా సొంత ఊరికే ఏం చేయ్యలేనోడు... మనకేం చేస్తాడనుకొని ఆయనను ఓడించారని మరోటాక్. పోనీలేండి... ఇలా అయినా సరే సొంత ఊరిలో పోయిన పేరు ప్రఖ్యాతులు తిరిగి సంపాదించుకుంటాడేమో. కొంపదీసి పోగోట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్నట్టుగా వచ్చే ఎన్నికల్లో చిరు మళ్లీ ఇక్కడి నుంచి పోటీచేయాలన్న ఆలోచనలో లేరు కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ