ఏంటీ... కోడిపందాలను చట్టబద్ధం చేయాలా?

January 01, 2015 | 05:25 PM | 41 Views
ప్రింట్ కామెంట్

సంక్రాంతి పండగ వచ్చిందంటే కోడి పందాలకు పందెం రాయుళ్లు సిద్ధమయిపోతారు. అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను పందాలకు అనుమతిచ్చేది లేదంటున్నారు. ఇదిలా ఉంటే ఇది అసలు సాంప్రదాయ క్రీడ అని, పండుగ మూడు రోజులు తమకు పందాలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అంటున్నారు. లేకుంటే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుంటారట ఉండి ఎమ్మెల్యే కలువపూడి శివరామరాజు గారు. ఇక మరో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ... కోడి పందాలు సంక్రాంతి పండుగ మూడు రోజులు నిర్వహించుకునేలా అనుమతివ్వాలట. అంతేకాదు పనిలోపనిగా దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పందాలను ఆపడం ఎవరి వల్ల కాదని నొక్కి చెప్పారు. అరెస్టులు చేసినా పందాలను వేయకుండా ప్రజలను నియంత్రించలేరని చెప్పారు. అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఈ పందాలలో పాల్గొంటారని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఓవైపు కోడిపందాలను అరికట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీచేస్తే, మరోవైపు పందాలను కొనసాగించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయడం, ఇలా అనుకూలంగా ప్రకటనలు చేయటం సిగ్గుచేటు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ