స్మార్ట్ విలేజ్, వార్డ్, డివిజన్... వెరసి స్మార్ట్ ఏపీ

January 01, 2015 | 01:38 PM | 46 Views
ప్రింట్ కామెంట్

రాష్ట్రంలో ఆరు నెలల పాలన విజయవంతంగా పూర్తి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 ఒక భయంకరమైన సంవత్సరంగా అభివర్ణించారు. విభజన సమయంలో అప్పులు జనాభా ప్రాతిపదికన చేశారు.. కానీ ఆదాయం మాత్రం అలా చేయలేదన్నారు. ఇబ్బందులు ఉన్నా రైతు రుణ మాఫీ చేశామని తెలిపారు. అంతే కాకుండా 24 గంటలు కరెంటు ఇచ్చిన ఘనత తమదేనని సీఎం స్పష్టం చేశారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్, స్మార్ట్ డివిజన్ పేరుతో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అందరూ భాగస్వాములు అవుతారని తెలిపారు. ఈ పథకం కోసం www.smart.ap.govt.in ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు.202కి ఏపీ టాప్ 3 హై ఫెఫార్మెన్స్ స్టేట్ లా తయారు చేయాలని యోచిస్తున్నామని తెలిపారు. 2029కి ఇండియాలోనే ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంలా తయారు చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నామని తెలిపారు. అందరూ జన్ ధన్ యోజన పథకం ద్వారా బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాయాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలని పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ