అవునా... మూడేళ్లలో పూర్తిచేస్తారా?

November 29, 2014 | 03:32 PM | 35 Views
ప్రింట్ కామెంట్

ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించేశారు. టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. మూడేళ్లలో గోదావరిపై పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని... 80 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలిస్తామని చెప్పారు. విభజనకు ముందే గందరగోళంగా ఉన్న ప్రాజెక్టు వ్యవహారాన్ని మూడేళ్లలో పూర్తిచేయడమంటే అయ్యే పనేనా?. గత ప్రభుత్వ హయాంలో భారీగా నిధుల దోపిడీ జరిందన్న విషయమై మైమరిచిపోయి అల్రెడీ జాతీయహోదా ఉంది, పైగా ఎలాగూ కేంద్రం ప్రభుత్వంలో ఉన్నది మన మిత్ర పక్షమే కదా, పూర్తిచేయోచ్చు అనుకుంటున్నారెమో. మంత్రిగారూ అది మూడు రాష్ర్టాల భవిష్యత్ పై ఆధారపడి ఉందన్న విషయాన్ని మరిచిపోతున్నట్టున్నారు. ఇప్పటికే రోజుకో అంశం లెక్కన తెలంగాణ ప్రభుత్వం రచ్చ కీడుస్తున్న సమయంలో ఇలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడం సరికాదండోయి. చేసే వాళ్లు సైలెంట్ పనికాచేయోచ్చు కదా!. అయిన అసలు ఇదీ మూడేళ్లలో తేలే వ్యవహారమేనా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ