ఏపీ అధికారపక్ష నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య వివాదం అసెంబ్లీని కుదిపేసింది. బుచ్చయ్య చౌదరి రోజాను లేడీ విలన్ అనటం, ఆమె చెవిరెడ్డితో కలిసి బుచ్చయ్య మీదకు దూసుకెళ్లటం. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట కూడా జరిగింది. అయితే ఈ వివాదం గురించి మంగళవారం అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా అధికారపక్ష నేత, మహిళా మంత్రి పీతల సుజాత, రోజా వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. మహిళలకు తమ పార్టీ విపరీతమైన గౌరవం ఇస్తుందని. కానీ... ఒక మహిళా నేతగా రోజా సమావేశాల ప్రారంభం నుంచి దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రులను కూడా వేలెత్తి చూపుతున్నారని మండిపడ్డారు. రోజా వ్యవహారశైలిని ఎవరు సమర్థించినా.. తాను రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. రోజా తన హోదాకు తగ్గట్లు నడుచుకోవటం లేదని.. నేతల్నిచూపిస్తూ ఒకానోక దశలో బండబూతులు మాట్లాడతారంటూ ఆమె ఆరోపణలు సంధించారు. అసలు రోజాను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.