తారా కవితాంకం పార్ట్-2

December 12, 2015 | 12:36 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Tara-chowdary-arrested-for-assaulting-lady-cop-niharonline

తారా చౌదరి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లో ఇంట్లోనే సెక్స్ రాకెట్ నడుపుతూ పట్టుబడి పెద్ద బాబుల పేర్లు వెల్లడించి బాంబులు పేల్చింది నటీమణి. కొందరు రాజకీయ నాయకులు కూడా తనను వాడుకున్నారని తారా చౌదరి గతంలోనూ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. అవసరమైతే వారి చిత్రాలు, వీడియోలు భయటపెడతానని ప్రకంపనలు సృష్టించింది. చివరికి చచ్చి చెడి ఎలాగోలా ఆ కేసు నుంచి బయటికి వచ్చి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండింది.

ఇక ఇప్పుడు ఈ జూనియర్ నటి మరోసారి వివాదంలో చిక్కుకుంది. సొంత వదిన కవితపై దాడి ఘటనలో విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైంది. కుటుంబ కలహాలతో గత రాత్రి తన వదినపై ఆమె దాడికి ప్రయత్నించింది. అక్కడికి వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ పై కూడా ఆమె దాడి చేసింది. దాంతో కవితతో బాటు, కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. దాంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు వదిన ఫిర్యాదుతో 332, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘర్షణ వద్దని నచ్చజెప్పేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ పై కూడా ఆమె దాడి చేసింది. ఈ నేపథ్యంలో, ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు... తారా చౌదరికి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో, ఆమెను విజయవాడలోని సబ్ జైలుకు తరలించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ