హామీలను త్వరగా అమలు చేయండి

November 22, 2014 | 03:40 PM | 38 Views
ప్రింట్ కామెంట్

విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ త్వరగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన కేంద్రమంత్రులతో భేటీలో ఇదే అంశంపై విజ్ఞప్తి చేశారు. తొలుత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన ఆయన రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. హుద్ హుద్ తుపాను బాధితులకు ప్రధానమంత్రి ప్రకటించిన రూ.1,000 కోట్లలో రూ. 400 కోట్లు మాత్రమే వచ్చాయని, మిగిలిన మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని రాజ్‌నాథ్‌కి విజ్ఞప్తి చేశారు. అనంతరం రైల్వే మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పన్ను ప్రోత్సాహకాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై 30 నిమిషాలకు పైగా చర్చించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో సమావేశమయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ