నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో నకిలీ పోలీసులు హల్ చల్ చేశారు. దుండగులు పోలీసుల పేరుతో దాదాపు 82 లక్షల రూపాయలు దోపిడీ చేశారు. తోలుత రైలులో పలువురిని వారు తనిఖీ చేశారు. ఇద్దరు బంగారు వ్యాపారులు రామయ్య, మరొకరిని కూడా తనిఖీ చేశారు. రైలు పడుగుపాడు వద్దకు రాగానే విచారణ పేరుతో వారు ఆ వ్యాపారులను కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. కారు దామవరం వద్దకు వెళ్లిన తరువాత, వ్యాపారుల వద్ద ఉన్న డబ్బును తీసుకొని వారిని కిందకు తోసి పారిపోయారు. వ్యాపారులు కావలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోపిడీ చేసిన రూ.82 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఓ కొత్త కోణం వెలుగు చూసింది. వ్యాపారులను బెదిరించి వారి వద్ద నుంచి రూ.82 లక్షలు దోచుకు వెళ్లిన నలుగురు దుండగుల్లో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు కావటం విశేషం. వీరంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు.