అలర్ట్ : ‘మిస్డ్ కాల్’ ప్రేమతో మోసపోయిన యువతి

May 08, 2015 | 11:52 AM | 76 Views
ప్రింట్ కామెంట్
chitoor_girl_cheated_by_boy_missed_call_love_niharonline

ఓ మిస్డ్ కాల్ ఆ యువతి జీవితాన్నే మార్చివేసింది. వచ్చిన నంబర్ కు తిరిగి కాల్ చేసినందుకు పెద్ద ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది. వివరాల్లోకి వెళ్లితే... చిత్తూరు జిల్లా పోలేపల్లి గ్రామానికి 19 ఏళ్ల యువతికి ఫోన్ లో గొల్లపల్లె గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. గత నెలలో వారిద్దరు కలుసుకోని పెళ్లి చేసకుందామని చెప్పగా, ఆ యువతి ఇంట్లోంచి వచ్చేసింది. 20 రోజులు పలమనేరులో ఆ యువతితో సహజీవనం గడిపిన ప్రేమ్ ఉద్యోగం వెతుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. మోసపోయాయని గ్రహించిన యువతి తల్లిదండ్రులకు తిరిగి ఫోన్ చేయగా, వారు ఇంటికి రానక్కర్లేదని స్పష్టంచేశారు. దీంతో ఆ యువతి పోలీస్ లను ఆశ్రయించింది. వారు ఐసీడీఎస్ అధికారులకు విషయం తెలిపి మదనపల్లి చైల్డ్ హోంకు యువతిని తరలించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ