రాత్రి పూట మీ ‘డామినేషన్’ చాలిక

December 08, 2014 | 01:05 PM | 80 Views
ప్రింట్ కామెంట్

నేరాల అదుపు చేసేందుకంటూ రాత్రి గస్తీతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బెజవాడ పోలీసులకు హైకోర్టు మొట్టికాయలేసింది. విజయవాడ నగరవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ రాజ్యంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. అంతేకాక తక్షణమే సదరు ఆపరేషన్ ను నిలుపుదల చేయాలని బెజవాడ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నగర సమీపంలోనే నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటవుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు ముందస్తు చర్యల్లో భాగంగా నగర పోలీసులు రాత్రి గస్తీని పెంచారు. ఇందులో భాగంగా గత నెల వందల సంఖ్యలో కూలీలను పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టారు. అంతేకాక గుర్తింపు కార్డులు లేనిదే రాత్రి వేళ బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాది చిరంజీవి పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తూ హైకోర్టు గడప తొక్కారు. చిరంజీవి పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆపరేషన్ నైట్ డామినేషన్ ను నిలిపేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ