రాజమహేంద్రవరంలో కేరళ యువతిపై గ్యాంగ్ రేప్

April 18, 2016 | 12:26 PM | 3 Views
ప్రింట్ కామెంట్
kerala-girl-gangrape-Rajamahendravaram-niharonline

అమ్మాయిల భద్రతను ప్రశ్నించే మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం(రాజమండ్రి) లో చోటుచేసుకుంది.  19 ఏళ్ల ఓ యువతిపై నలుగురు మృగాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేరళ రాష్ట్రానికి చెందిన యువతి నెహ్రూనగర్‌లోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటూ ప్రకాశ్‌నగర్‌ ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఫ్లవరిస్ట్ గా పనిచేస్తోంది. శనివారం  విధులు ముగించుకుని ఇంటికి చేరగా రాత్రి 11.30 గంటల సమయంలో ఆమె స్నేహితులు ఫోన్‌చేసి మరో స్నేహితుడి వివాహ పనుల్లో పాల్గొనేందుకు రమ్మని కోరారు. దీంతో ఆమె వారితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లింది. కాగా, టిటిడి కల్యాణ మండపం వద్ద నలుగురు యువకులు రెండు బైక్‌లపై వచ్చి వారిని అడ్డగించారు. రాము, కిరణ్‌లను భయపెట్టి యువతిని తమతో తీసుకెళ్లారు.

                     లాలాచెరువు ప్రాంతంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. కాళ్లు పట్టుకున్న కనికరించకుండా గాయపరుస్తూ, దుర్భషలాడుతూ ఘోరానికి పాల్పడ్డారు.  అనంతరం యువతి రోదనతో మళ్లీ ఇంటివద్ద దింపేందుకు వెళ్తుండగా  లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో గాయపడిన ఆమెను వీఎల్‌పురంలోని ఆస్పత్రిలో చేర్చి వారు పరారయ్యారు. కొద్ది సమయానికి తేరుకున్న ఆమె తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆస్పత్రి సిబ్బందికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. అక్కడి సీసీ కెమెరాల్లో దృశ్యాలను పరిశీలించి ఆస్పత్రిలో చేర్చిన యువకులను స్థానిక రాజేంద్రనగర్‌కు చెందిన రౌడీషీటరు కక్కల సతీష్‌, తాడేపల్లి ప్రేమ్‌కుమార్‌, పలివెల రాజు, మణికంఠలుగా గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ